eenadu media - Latest News in Telugu, Photos, Videos, Today Telugu News on eenadu media | Sakshi (2024)

  • బురిడీ కొట్టించడమే బాబు నైజం.. అంతా మాయే! ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మొదటి సారిగా ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తున్న ఆరు గ్యారంటీలపై గట్టిగా స్పందించారు. ఇంతకాలం చంద్రబాబు ప్రజల వద్దకు వచ్చి బెంజ్ కారు ఇస్తానని అంటారని, కిలో బంగారం ఇంటింటికి ఇస్తానని చెబుతారని, అలాంటి మోసపూరిత వాగ్దానాలను నమ్మవద్దని ప్రజలకు చెబుతుండేవారు. కాని ఈసారి శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానం చెబుతూ సవివరంగా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ వాగ్దానాలలో ఎంత డొల్ల ఉన్నది ఆయన స్పష్టంగా తెలిపారు. తాను అమలు చేస్తున్న స్కీములకు డబ్బైరెండువేల కోట్ల వ్యయం అవుతోంందని, దాంతో రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు అంతకు రెండు, మూడు రెట్ల వాగ్దానాలు చేస్తున్నారని, వాటికి లక్షాపాతికవేల కోట్ల నుంచి లక్షాఏభై వేల కోట్ల వ్యయం అవతుందని, అప్పుడు ఏపీ ఎన్ని శ్రీలంకలు అవ్వాలని జగన్ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు చంద్రబాబు నుంచికాని, ఆయనను భుజాన వేసుకుని మోసే మీడియాల నుంచి కాని సూటిగా సమాదానం లభించదు. చంద్రబాబు సంపద సృష్టించి స్కీములు అమలు చేస్తారని బొల్లుతుంటారు. దానిని చాలా స్పష్టంగా రుజువు చేస్తూ జగన్ అసెంబ్లీలో అంకెలను ప్రదర్శించి మరీ తెలియచెప్పారు. ఈ మాట అంటుంటే ఒక సంగతి గుర్తుకు వస్తుంది. చంద్రబాబు నాయుడు 1995-2004 మధ్య ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 54 ప్రభుత్వరంగ సంస్థలను మూసివేశారు. అవన్ని నిరర్దకమని, నష్టాలు తెచ్చేవని అప్పట్లో ప్రభుత్వపరంగా చెప్పేవారు. అలాగే విద్యుత్ రంగంలో అనేక మార్పులు వచ్చాయి. వాటివల్ల ప్రజలపై భారం పెరిగేది. ప్రపంచ బ్యాంక్ రుణం ఇవ్వాలంటే పలు షరతులు పెట్టేది. విద్యుత్ రంగంలో నష్టాలు తగ్గించాలని, రేషన్ కార్డులు కట్ చేయాలని, నష్టాలలో ఉన్న ప్రభుత్వ సంస్థలను ఎత్తివేయాలని ..ఇలా పలు కండిషన్ లు పెడితే అందుకు చంద్రబాబు ఒప్పుకున్నారు.ఆ రోజుల్లో కూడా ఆయన ఇదే సంపద సృష్టి అంటూ బడాయి పదాలు వాడేవారు. విద్యుత్ సంస్కరణల వల్ల చాలా సొమ్ము ఆదా అవుతుందని,దానిని పేదలకు వ్యయం చేస్తామని అనేవారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తానని హామీ ఇచ్చేవారు. దీనిపై చంద్రబాబు విమర్శిస్తూ,అలాగైతే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని అనేవారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలలో విపరీతమైన వ్యతిరేకత పెరిగి 2004 ఎన్నికలలో ఘోరంగా ఓటమి పాలైంది. ఉమ్మడి ఏపీలో 47 సీట్లు మాత్రమే వచ్చాయి. అందులోను తెలంగాణలో అతి తక్కువగా 11 సీట్లే టీడీపీకి దక్కాయంటే ఏ స్థాయిలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారో అర్ధం చేసుకోవచ్చు. విశేషం ఏమిటంటే ఆ తర్వాత రోజులలో ఆయన అన్ని విషయాలలో యుటర్న్ తీసుకున్నారు.ఉచిత విద్యుత్ ను తాను కూడా ఇస్తానని చెప్పేవారు. అంతెందుకు ..ఈ మధ్యకాలంలో కేంద్రం చేసిన సూచన ప్రకారం వ్యవసాయ మోటార్లకు జగన్ ప్రభుత్వం మీటర్లు పెట్టి, వారు వినియోగించే విద్యుత్ కు అయ్యే మొత్తాన్ని ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకుంది. దానిని కూడా చంద్రబాబు తప్పుపట్టి ,మీటర్లు అంటే రైతులకు ఉరి వేయయడమే అంటూ దిక్కుమాలిన ప్రచారం చేశారు. అంటే ఆయన తాను సంస్కరణవాదినని చెప్పుకునేది అంతా బోగస్ అని రుజువు చేసుకున్నారు. అదే కాదు. రైతు రుణమాఫీ అమలు చేస్తానని 2014లో హామీ ఇచ్చి ,తీరా అధికారంలోకి వచ్చాక చేతులెత్తేశారు. 89 వేల కోట్ల రూపాయల రుణాలకు గాను పదిహేనువేల కోట్ల రుణాలను మాఫీ చేసి చేతులు దులుపుకున్నారు. దాంతో రైతులలో తీవ్రమైన అసంతృప్తి ఏర్పడింది.చంద్రబాబు వల్ల రైతులు రుణాల బారిన పడి బాగా నష్టపోయారు. ఇలా ఒకటేమిటి! సుమారు ఆరువందల హామీలు ఇచ్చి ,మానిఫెస్టోని వెబ్ సైట్ నుంచి తొలగించి ప్రజలను ఏమార్చే యత్నం చేశారు. దానిని గమనించిన ప్రజలు టీడీపీని 2019లో కేవలం 23 సీట్లకే పరిమితం చేశారు. ఈ నేపద్యంలో విశ్వసనీయత అంశాన్ని జగన్ ప్రస్తావించి, మాట ఇస్తే తప్పకుండా అమలు చేయాలని, చంద్రబాబు లా మోసం చేయకూడదని అన్నారు.కాని బాబు స్యూరిటీ,భవిష్యత్తుకు గ్యారంటీ అంటూ ఒక డైలాగును తీసుకుని తెలుగుదేశం ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ పాయింట్ ను జగన్ వివరిస్తూ మహిళా శక్తి కింద ప్రతి మహిళకు ఇచ్చే 1500 రూపాయల స్కీము ఒక్కదానికే 36వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా. ఒకప్పుడు ఏది ఉచితం కాదని చెప్పిన చంద్రబాబు ప్రతిపక్షంలోకి రాగానే అన్నీ ఉచితం అంటారు. అదే ప్రకారం 2024 ఎన్నికలు తెలుగుదేశం భవిష్యత్తును నిర్దేశించేవి కావడంతో , ఎన్ని వీలైతే అన్ని అబద్దపు వాగ్దానాలను చేస్తూ ప్రచారం కావిస్తున్నారు.వీటిని జనం నమ్మరు. అయినా కొందరు అమాయకులు విని మోసపోయే అవకాశం ఉండడంతో జగన్ ఆ విషయాలను ప్రస్తావించి చంద్రబాబు ట్రాక్ రికార్డు చూడాలని ప్రజలను కోరారు. తాను ఇచ్చిన హామీలలో 99 శాతం అమలు చేశానని జగన్ చెప్పారు. తాను కేవలం సంక్షేమ కార్యక్రమాలే కాదని, పలు అబివృద్ది పనులను చేపట్టామని, పోర్టుల నిర్మాణం తదితర పెట్టుబడి వ్యయం గురించి వివరించారు. సంపద గురించి జగన్ మాట్లాడుతూ చంద్రబాబు టైమ్ లో జీఎస్‌డీపీ కన్నా, తన పాలన టైమ్ లో పెరిగిన జీఎస్‌డీపీ శాతాన్ని గణాంకాలతో సహా తెలియచెప్పారు. సంపద అంటే ఒక మాట చెప్పుకోవాలి. జగన్ పేద ప్రజలందరికి వివిద స్కీములు అమలు చేయడం ద్వారా వారికి సంపద సృష్టించారు. ఉదాహరణకు 31 లక్షలమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఆ స్థలం విలువ కనీసం రెండు లక్షల రూపాయల నుంచి గరిష్టంగా పది లక్షలపైనే ఉంటుంది.ఆ ప్రకారం ఆ కుటుంబాలకు ఆస్తి సమకూరినట్లే. వారికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. తద్వారా వారి ఆస్తి విలువ పెరుగుతుంది. మరి చంద్రబాబు కనీసం ఒక్కరికైనా ఇళ్ళ స్థలం ఇచ్చారా అన్నదానికి జవాబు దొరకదు. అయితే ఆయన అమరావతి ప్రాంతంలో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఉపయోగపడడం కోసం తన శక్తియుక్తులన్నీ వాడారని చెప్పాలి. తన అనుచరులు ఇన్ సైడ్ ట్రేడింగ్ కుపాల్పడడం ద్వారా లాభపడ్డారు. దీనిని బట్టి రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరికి సంపద సృష్టించింది జగన్ అయితే, కేవలం ధనికులకే సంపద పెంచే యత్నం చేసింది చంద్రబాబు అని అర్ధం చేసుకోవచ్చు. చంద్రబాబు బలం ఎల్లో మీడియా అని అంటూ, ఈనాడు, ఆంద్రజ్యోతి, టివి 5 వంటి మీడియా సంస్థలు తెలుగుదేశం కోసం పనిచేస్తూ చెప్పిన అబద్దం చెప్పకుండా ప్రచారం చేస్తున్నాయని జగన్ చెప్పారు.ఇది కూడా పచ్చి నిజం. రోజూ ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాదాకృష్ణలు పోటీపడి తమ సిబ్బంది తో దారుణమైన అబద్దాలు రాయిస్తున్నారు. టీవీలలో ప్రసారం చేయిస్తున్నారు. ఈ దుర్మార్గపు మీడియాను ఎదుర్కోవడం కూడా జగన్ ముందు సవాలుగా మారింది. అప్పులు,పొత్తులు వంటి విషయాలపై కూడా జగన్ చాలా వివరంగా చెబుతూ నిశితమైన విశ్లేషణ చేశారు. జగన్ వచ్చే ఎన్నికలలో కచ్చితంగా గెలిచి తీరతామని ధీమా వ్యక్తంచేస్తూ జూన్ లో కొత్త బడ్జెట్ ప్రవేశపెడతామని ప్రకటించారు. చంద్రబాబు చేస్తున్న మోసపూరిత వాగ్దానాలను ప్రజలకు తెలియచేయడంలో ఈ స్పీచ్ ద్వారా జగన్ సఫలం అయ్యారని చెప్పవచ్చు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు Wed, Feb 7 2024 12:08 PM
  • అబద్ధాలు వండబడును c/o రామోజీ కాంగ్రెస్ మాజీ శాసనసభ్యుడు, దివంగత కాపు నేత వంగవీటి రంగాపై ఈనాడు రామోజీరావుకు ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. అలాగే కాపులపై ఎక్కడలేని ఆప్యాయతను కురిపిస్తున్నారు. ఇదంతా ఎన్నికల కోసం, తెలుగుదేశం పార్టీ కోసం ఆడుతున్న కపట ప్రేమే అన్న సంగతి తెలిసిపోతూనే ఉంది. కొద్ది రోజుల క్రితం కాపులపై వైఎస్సార్‌సీపీ వల అంటూ ఒక తప్పుడు వార్తను సృష్టించడంలో ఈనాడు మీడియా దురుద్దేశం కనిపెట్టలేరా! గతసారి వైఎస్సార్‌కాంగ్రెస్‌కుమద్దతు ఇచ్చి కాపులను ఆ పార్టీకి ఎంతో కొంత దూరం చేయడమే ఈనాడు మీడియా లక్ష్యం.ఆ ఒక్క వర్గాన్నే కాదు.. వైఎస్సార్‌సీపీకి బాగా మద్దతు ఇచ్చే ప్రతి వర్గంలోను ప్రభుత్వంపై వ్యతిరేకత సృష్టించడానికి నానా పాట్లు పడుతున్న రామోజీరావు తన పత్రికను టీడీపీ కరపత్రంగా హీనంగా మార్చివేశారు. ఆయా వర్గాలను ఆకట్టుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలు ఏవో వేసుకుంటాయి. వాటిని కధనాలుగా ఇవ్వడం తప్పుకాదు.కాని లేని వాటిని కల్పించి, అసత్యాలను అలవోకగా వండేసి పాఠకులపై రుద్దాలనుకోవడమే నీచం. రామోజీకి ఈ వయసులో ఇంత అప్రతిష్టపాలు అవడం వల్ల వచ్చే లాభం ఏమిటో తెలియదు. కాని ఏదో అపరిమతమైన లబ్ది కోసమే ఆయన ఇంతగా దిగజారారానిపిస్తుంది.ఆ వార్తలో ఏమి రాశారో చూడండి.. కాపులకు గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిజర్వేషన్లు ఇచ్చేశారట. దానిని జగన్ అమలు చేయడం లేదట. ఏమన్నా బుద్ది జ్ఞానం ఉన్నవారు ఎవరైనాఇంత పచ్చి అబద్దాన్ని రాయగలుగుతారా! పార్టీ కార్యకర్తలకన్నా హీనంగా జర్నలిస్టులను ఇలా తయారు చేస్తారా? కాపు రిజర్వేషన్లపై 2014 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పని చేసేస్తానని కాపులను నమ్మబలికారు. దానిని నమ్మి ఆ వర్గం వారు టీడీపీకి ఓట్లు వేశారు. అందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సాక్ష్యం. ఆయన కూడా కాపు కావడంంతో చంద్రబాబు హామీ అమలు అవుతుందిలే అని అమాయక కాపులు నమ్మారు.ఆ తర్వాత ఏమి జరిగింది! చంద్రబాబు కేంద్రానికి ఒక తీర్మానం పంపి వదలివేశారు. దాంతో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో కాపులు ఉద్యమించారు. అప్పుడు చంద్రబాబు కొత్త డ్రామా ఆడారు. కాపులను బీసీలలో కలిపే విషయంలో విచారణ చేసి సిఫారస్ చేయడం కోసం జస్టిస్ మంజూనాధ కమిషన్ను నియమించారు. కొందరు సభ్యులను కూడా ఇందులో వేశారు. ఆ కమిషన్ ఆయా ప్రాంతాలలో తిరిగి వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించింది. కాపులను బీసీలుగా గుర్తించడానికి బీసీ వర్గాల వారు అంగీకరించలేదు. అలా ఆ రెండు వర్గాల మధ్య అదొక వివాదంగా మారింది.ఈ కమిషన్ కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదని సిఫారస్ చేస్తుందని సందేహించిన చంద్రబాబు నాయుడు కమిషన్‌లోని సదరు సభ్యులను మేనేజ్ చేసి చైర్మన్ తో సంబందం లేకుండా ఒక నివేదిక తెప్పించుకుని కాపులకు రిజర్వేషన్ లు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈలోగా కేంద్ర ప్రభుత్వం ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలవారికి పది శాతం రిజర్వేషన్ లు ఇచ్చింది. దానికి తనదైన భాష్యం చెప్పి చంద్రబాబు నాయుడు ఆ పదిశాతంలో ఐదు శాతం కాపులకు ఇస్తామని ప్రకటించారు. నిజానికి అది చెల్లదు. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టంలో కనుక ఐదు శాతం ప్రత్యేకించి కాపులకు రిజర్వేషన్లు పెట్టి, మిగిలిన ఐదు శాతం ఇతర అగ్రకుల పేదలకు అని చెప్పి ఉంటే అప్పుడు సాధ్యమయ్యేది.ఇది దేశవ్యాప్త అంశం కనుకక కేంద్రం అలా చేయలేదు. అయినా కాపులను మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు చెల్లని చట్టాన్ని తీసుకు వచ్చారు. కోర్టులలో అది నిలబడని పరిస్థితి. దీనిని ఈనాడు రామోజీరావు వక్రీకరించి చంద్రబాబు కాపులకు రిజర్వేషన్లు ఇచ్చినట్లు, దానిని జగన్ అమలు చేయనట్లు దుర్మార్గపు రాతలు రాశారు. కేవలం తెలుగుదేశం పార్టీకి జాకీలు వేసి లేపడం కోసమే ఈ అబద్దాలు వండుతున్నారన్నది స్పష్టం అవుతుంది. ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో తుని వద్ద కాపుల భారీ సభ జరిగింది.సభ పూర్తి అయ్యాక కొంతమంది ఆవేశపరులు రిజర్వేషన్ల డిమాండ్తో రైల్వే లైన్ పైకి వెళ్ళారు. ఆ టైమ్లో ఎవరో రైలు భోగీలకు నిప్పు పెట్టారు. అది పెద్ద సంచలనం అయింది.అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆ మంటలను ఆర్పడానికి కాకుండా, దానిని ఒక అవకాశంగా మార్చుకుని ప్రతిపక్షనేత జగన్ పైన, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పైన బురద చల్లే యత్నం చేశారు. పైగా రాయలసీమ నుంచి, కడప నుంచి వచ్చిన రౌడీలు ఈ పని చేశారని ఆరోపించారు. తీరా కేసు విచారణలో పోలీసులు కాపు నేతలు పలువురిని అరస్టు చేశారు. ముద్రగడను అరెస్టు చేయడానికి పోలీసులు ఇంటికివెళ్లినప్పుడు ఆయన కుటుంబ సభ్యులను ఎంత నీచంగా దూషించింది ఆయనే స్వయంగా కన్నీళ్లుపెట్టుకుని చెప్పారు. ఇంకోసారి ముద్రగడ పాదయాత్ర చేపడితే ఇంటి నుంచి బయటకు రాకుండా వందలాది మంది పోలీసులను కిర్లంపూడి వద్ద మోహరింప చేసి కదలనివ్వలేదు.అదంతా ప్రజాస్వామ్యంగా ఈనాడు రామోజీకి కనిపించింది. గత ఎన్నికల సమయంలో జగ్గంపేట ప్రాంతంలో జగన్ పర్యటిస్తున్నప్పుడు ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఆయన వెంటనే ఒక మాట చెప్పారు. అది తమ పరిధిలో లేని అంశమని, కేంద్రం ప్రభుత్వం చేతిలో ఉంటుందని విస్పష్టంగా తెలిపారు. తాను మాత్రం కాపులకు ఐదువేల కోట్లు కేటాయించి ఆదుకుంటానని హామీ ఇచ్చారు. దానికి చాలామంది సంతృప్తి చెందారు.ఫలితంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు తప్ప అన్నిటిని వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. అప్పట్లో పవన్ కళ్యాణ్‌ కనీసం ముద్రగడకు సానుభూతి కూడా చెప్పలేదు. కాపులకు రిజర్వేషన్లు ఏమిటి? తాను కులాలకు అతీతుడని చెబుతూ చంద్రబాబుకు ఇబ్బంది లేకుండా మాట్లాడేవారు. కాని అదే పవన్ కళ్యాణ్‌ ఈ ఎన్నికల సమయంలో కాపులకు కుల భావన లేకపోతే ఎలా అని వ్యాఖ్యానించి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.జగన్ కాపులకు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదని అజ్ఞానంగానో, లేక మోసపూరితంగానో ప్రశ్నిస్తున్నారు. గతంలో ముద్రగడ పట్ల చంద్రబాబు ప్రభుత్వ అనుచితంగా వ్యవహరించినప్పుడు పవన్ సోదరుడు ,మెగాస్టార్ చిరంజీవి సంఘీభావం తెలపడానికి గాను రాజమండ్రి వెళితే విమనాశ్రయంలోనే పోలీసులు నిలిపివేశారు. అయినా అప్పుడు కూడా చంద్రబాబుకే పవన్ మద్దతు ఇచ్చారు. ఇక వంగవీటి రాధా విషయానికి వద్దాం. ఆయనకు గత ఎన్నికల సమయంలో సీటు ఇవ్వలేదంటూ ఈనాడు తప్పుడు ప్రచారం చేసింది. నిజానికి రాధాను పార్టీ వదలవద్దని, బందరు ఎమ్.పి సీటు ఇస్తామని చెప్పినా వినకుండా ఆయన టీడీపీలో చేరారు.ఒకప్పుడు తన తండ్రిని చంద్రబాబే చంపించారని చెప్పిన రాధా టీడీపీలో చేరడాన్ని రంగా అభిమానులు ఎవరూ జీర్ణించుకోలేకపోయారు.. పోనీ అక్కడ ఏమైనా సీటు ఇచ్చారా? ఎమ్మెల్సీ పదవి ఏమైనా ఇచ్చారా? అదీ లేదు. కాని రాధామీద రామోజీరావు ప్రేమ ఒలకపోస్తున్నట్లు నటిస్తున్నారు. ఈ సందర్భంలో ఒక విషయం గుర్తు చేయాలి. నాలుగు దశాబ్దాల కిందట రామోజీరావు ప్రతిఘటన అనే సినిమా తీశారు. అందులో రాధా తండ్రి, దివంగత కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగాను పరోక్షంగా విలన్ గా చిత్రీకరించింది వాస్తవం కాదా! ఆ సినిమాలో చివరి సన్నివేశంలో హీరోయిన్ విలన్ను గొడ్డలితో నరికి చంపినట్లు చూపుతారు.ఆ తర్వాత కొంతకాలానికిబందరు రోడ్డులో నిరసన దీక్ష చేస్తున్న రంగాను టీడీపీకి సంబంధించినవారు గొడ్డళ్లతోనే నరికి హత్య చేశారు. ఆ హత్య విషయం అంతా చంద్రబాబు నాయుడుకు ముందే తెలుసునని కాపు నేత, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య తన పుస్తకంలో రాశారు. దాని గురించి ఎన్నడైనా ఈనాడు రామోజీరావు వార్తలుగా ఇచ్చారా? విశేషం ఏమిటంటే ఆ రోజుల్లో రంగా అభిమానులకు, టీడీపీ వారికి ఉప్పు, నిప్పుగా ఉండేది. అలాంటిది రంగా విగ్రహానికి స్వయంగా టీడీపీ పెద్ద నేతలు దండలు వేసి ఆయనపై అభిమానం ఉన్నట్లు కనిపించే యత్నం చేయడం అంటే కాపు వర్గాన్ని బుట్టలో వేసుకోవడానికే అన్నది విదితమే.వంగవీటి రంగా హత్య తర్వాత ఆయన భార్య రత్నకుమారికి టిక్కెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే. ఆమె రెండుసార్లు గెలిచారు కూడా. ఆ తర్వాత ఆమె అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ వైపు మొగ్గు చూపారు. తిరిగి 2004లో రంగా కుమారుడు రాధాకు కాంగ్రెస్ టిక్కెట్ ఇప్పించింది వైఎస్ రాజశేఖరరరెడ్డి.ఆ తర్వాతకాలంలో రాధా కూడా జగన్ వెంట నడిచి విజయవాడ తూర్పు నుంచి పోటీచేసి ఓడిపోయారు. అయినా పార్టీలో ఆయనకు గుర్తింపు తగ్గలేదు. కారణం ఏమైనా ఆయన గత ఎన్నికల సమయంలో టీడీపీవైపు వెళ్లారు.ఇప్పుడు ఆయన మళ్లీ వైఎస్సార్‌సీపీలోకి వస్తారో లేదో తెలియదు.కాని ఈనాడు మాత్రం కంగారుపడుతూ ఇలాంటి అసత్యపు వార్తలు రాసింది.జగన్ అధికారంలోకి వచ్చాక తాను హామీ ఇచ్చిన విధంగా కాపు నేస్తం స్కీమును అమలు చేసి ఆ వర్గంం మహిళలకు ఏడాదికి 18500 చొప్పున ఆర్దిక సాయం చేస్తున్నారు. అంతేకాక కాపులలో పేదలైనవారికి కూడా వివిధ సంక్షేమ స్కీములు ఇస్తున్నారు. దానివల్ల కాపులలో ఆయనకు ఆదరణ కొనసాగుతోంది. దానిని తగ్గించడానికి చంద్రబాబు నాయడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రయోగించారు. పవన్ కళ్యాన్‌ వ్యూహాత్మక తప్పిదాలనండి, ఆయన ప్రత్యర్ధులు చెబుతున్నట్లు ప్యాకేజీ ఆకర్షణ అనండి.. ఆయన టీడీపీతో ఎలాంటి షరతులు లేకుండా పొత్తు పెట్టుకున్నారు.చివరికి లోకేష్ సీఎం.పదవి చేపట్టడానికి చంద్రబాబు మాదిరి పవన్ కు అనుభవం, సమర్ధత లేదని పరోక్షంగా చెప్పినా ఆయన మాట్లాడలేకపోయారు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్నా టీడీపీ పాలిట్ బ్యూరో డిసైడ్ చేయాలని మరింతగా అవమానించారు. దీనిని కాపువర్గం భరించలేకపోతోంది. ఈ నేపధ్యంలో కాపులను ఎలాగొలా చంద్రబాబు, పవన్లకు దూరంకాకుండా చూసే యత్నంలో భాగంగా ఈనాడు రామోజీరావు ఇలాంటి అసత్యపు వార్తలను ప్రచురించి, టివీలో ప్రసారం చేస్తున్నారు. ఇదంతా కాపులను మరోసారి మోసం చేయడానికే. రామోజీరావు వంటివారి మాటలను నమ్మి కాపులు మళ్లీ, మళ్లీ మోసపోవడానికి సిద్దపడతారా?- కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడమీ చైర్మన్.ఇవి చదవండి: బాబు బ్యాచ్ చిత్తు..! Mon, Jan 15 2024 11:32 AM
  • ‘‘ఆయన్ని నమ్మకద్రోహి, అవకాశవాది అనడం మేలు’’ ఈనాడు పత్రికాధిపతి రామోజీరావును కీర్తిస్తూ చాలామంది చాలా మాటలు అంటూంటారు. మీడియా మొఘల్‌ వంటి భుజకీర్తులు చాలానే తొడుగుతూంటారు. ఈ జాబితాలోకి నమ్మకద్రోహి, అవకాశవాదీ వంటివి కూడా చేరిస్తే బాగుంటుందేమో అంటున్నారు ఆయన తోడల్లుడు... డాల్ఫిన్‌ అప్పారావు! విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లోని ఈనాడు కార్యాలయం డాల్ఫిన్‌ అప్పారావు, ఈయన మేనమామలదే.వ్యాపారం కోసమని 33 ఏళ్లపాటు వాడుకోమని లీజుకిస్తే రామోజీరావు మోసం చేశాడని, గడవు తీరిన తరువాత కూడా రకరకాల కారణాలు, పేచీలతో కోర్టుల చుట్టూ తిప్పుతూ స్థలం ఖాళీ చేయకుండా తనకు ద్రోహం తలపెట్టారని ఆయన ఈమధ్యే ‘సాక్షి’ టీవీతో తన గోడు వెళ్లబోసుకున్నారు. రామోజీరావు నమ్మిన వాళ్లను మోసం చేయడం ఇదే మొదటిసారి కాదులెండి. 1974లో విశాఖపట్నంలో ఈనాడు మొదలైనప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది. ఈ ఉదంతాలకు సంబంధించి ఇప్పటికే బోలెడన్ని కథనాలు వార్తా పత్రికల్లోనూ అచ్చు అయ్యాయి.అక్కడేం జరిగింది?విశాఖపట్నంలోని సీతమ్మధారలో ఈనాడు తన మొట్టమొదటి కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన విషయం చాలామందికి తెలుసు. అయితే ఆ స్థలం ఎవరిదన్న విషయం తెలిసింది కొద్దిమందికే. ఈశ్వర కుమార్‌ వర్మ అనే వ్యక్తి ఈ స్థలాన్ని రామోజీరావుకు లీజుకిచ్చారు. దీర్ఘకాలిక లీజు. కచ్చితంగా చెప్పాలంటే 33 ఏళ్లు. హైదరాబాద్‌లోని సోమాజీగూడలో ఉన్న ఈనాడు ప్రధాన కార్యాలయం కూడా ఈ కుటుంబానిదేనని, రెండు చోట్లా లీజు గడువు ముగిసిన తరువాత కూడా స్థలం ఖాళీ చేసి యజమానులకు అప్పగించకుండా రామోజీ తన పేచీకోరు మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నారని డాల్ఫిన్‌ అప్పారావు సాక్షి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.ఇదంత ఒక ఎత్తు అయితే లీజుకు తీసుకున్న స్థలం తన సొంతమైనట్లు రోడ్డు విస్తరణ కోసమని ప్రభుత్వానికి అప్పగించడం.. ప్రతిగా అందే పరిహారాన్ని కూడా తన ఖాతాల్లో, తనవారి ఖాతాల్లో వేయించుకోవడం ఇంకో ఎత్తు. విశాఖపట్నం స్థలం 2.70 ఎకరాల్లో సుమారు 517 చ.మీటర్ల స్థలాన్ని మున్సిపల్‌ కమిషనర్‌ కార్యాలయానికి (రోడ్డు విస్తరణ కోసం) అప్పగించినందుకు గాను పరిహారంగా ఇచ్చిన 872 చ.మీటర్ల స్థలాన్ని రామోజీ తన పేరుతో రాయించుకున్నట్లు ఇప్పటికే ‍స్పష్టమైంది. అందుకేనేమో.. డాల్ఫిన్‌ అప్పారావు కూడా రామోజీని ‘కఠిన దుర్మార్గుడు’ అని అభివర్ణించారు.ఈశ్వర కుమార్‌ వర్మ కుటుంబానికే చెందిన స్థలంలో హైదరాబాద్‌లోని ఈనాడు కేంద్ర కార్యాలయం నిర్మించారని చెప్పుకున్నాం కదా.. ఈ విషయంలోనూ రామోజీరావు ఆడిన డ్రామా అంత ఇంత కాదని డాల్ఫిన్‌ అప్పారావు చెబుతారు. లీజు ముగిసిన తరువాత స్థలాన్ని ఖాళీ చేయకపోగా...స్థలాన్ని తనకే అమ్మేయాలని డిమాండ్‌ చేయడం.. అది కూడా పావల అర్ధకు ఇచ్చేయాలని చెప్పడం రామోజీరావు నైజాన్ని బయటపెడుతుందన్న విమర్శలున్నాయి. ఆఖరుకు సుప్రీంకోర్టు జోక్యం తరువాత గతిలేని పరిస్థితుల్లో హైదరాబాద్‌ ఈనాడు ప్రధాన కార్యాలయం ఉన్న స్థలాన్ని ఆయన కొనుగోలు చేయాల్సి వచ్చింది!ఏతావాతా..లీజు పేరుతో స్థలం తీసుకోవడం.. గడువు తీరినా ఖాళీ చేయకపోవడం.. పత్రికను అడ్డుపెట్టుకుని లీజుదారులను బెదిరించడం.. కోర్టుల చుట్టూ తిప్పడం ద్వారా అలసిపోయేలా చేసి రాజీకి ఒప్పించడం! ఇదీ రామోజీ మోడస్‌ ఆపరాండీ అంటారు డాల్ఫిన్‌ అప్పారావు. హైదరాబాద్‌, విజయవాడ స్థల వివాదాలను పరిశీలిస్తే ఇవన్నీ నిజమేనని అంగీకరించక తప్పదు! డాల్ఫిన్‌ అప్పారావు మాటల్లోనే చెప్పాలంటే న్యాయం జరగడంలో కొంత ఆలస్యమైతే కావచ్చు కానీ.. ఎప్పటికైనా సత్యం, ధర్మం గెలిచి తీరుతాయి! ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే! Fri, Jan 12 2024 4:58 PM
  • విశాఖ వృద్ధురాలి హత్యపై పిచ్చి రాతలు సాక్షి, అమరావతి: పేదల పొట్ట కొట్టాలని చంద్రబాబు కుళ్లు రాజకీయాలు చేస్తున్నాడని.. ఈ క్రమంలోనే పచ్చ మీడియాతో పిచ్చి రాతలు రాయిస్తున్నాడని.. అయితే వాస్తవాలు బయటపడడంతో ఇప్పుడు ఆ నోళ్లు మూతలు పడుతున్నాయని ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. మంగళవారం సచివాలయంలో ఆయన మాట్లాడుతూ..పది లక్షల కోట్లు అప్పులు చేశారని.. ఏపీని అప్పుల పాలు చేశారని పచ్చ బ్యాచ్‌ సీఎం వైఎస్‌ జగన్‌పై దుష్ప్రచారానికి దిగింది. పచ్చ పార్టీకి.. పిచ్చి రాతలు రాసే వాళ్ల నోళ్లు మూతలుబడేలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమాధానం చెప్పారు. టీడీపీ అధికారం నుంచి దిగిపోయే టైంకి రూ. 2.64 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. ఈ నాలుగేళ్లలో రూ. 1,77,991 కోట్ల అప్పులు మాత్రమే చేశారని పార్లమెంట్ సాక్షిగా వెల్లడైంది. ఒక పనికిమాలిన ఎంపి వేసిన ప్రశ్నతో వాస్తవం బట్టబయలైంది. టిడిపి తప్పుడు ప్రచారాలకి ఇది చెంప పెట్టు అని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు.►సీఎం జగన్ నాలుగేళ్లుగా సంక్షేమ‌పాలన అందిస్తున్నారు.. ప్రజాభిమానమూ పెరిగింది. ఆ ఆదరణ చూసి చంద్రబాబు తట్టుకోలేక రాష్ట్రం అప్పులపాలయ్యిందని.. శ్రీలంకలా మారిందని గోబెల్స్ ప్రచారం చేశారు. పేదల‌పొట్ట కొట్టాలని చంద్రబాబు కుళ్లు రాజకీయాలు చేశారు. కానీ, వాస్తవాలు బయటపడటంతో నోళ్లు మూతబడుతున్నాయి అని అన్నారాయన.► విశాఖలో వృద్దురాలు హత్యపైనా ఈనాడు పత్రిక అబద్దాలు ప్రచురించింది. మొత్తంవలంటరీ వ్యవస్థకు ముడిపెట్టి లేనిపోని రాద్ధాంతం చేస్తోంది. పనితీరు సక్రమంగా లేదని తొలగించిన వ్యక్తిని ఇంకా వలంటీర్ అని ఎలా రాస్తారు. కేవలం పిచ్చి రాతల్లో భాగంగానేఆ కథనం ప్రచురించింది అని మంత్రి మండిపడ్డారు.►చంద్రబాబు మూడు టర్మ్‌లలో రూ.7.50 లక్షల కోట్లు ఏం చేశారు? మూడు సార్లు సీఎంగా పని చేసి సంక్షేమాన్ని ఎందుకు అందించలేకపోయారు?. మా ప్రభుత్వం నాలుగేళ్లలో నేరుగా ప్రజలకి అందించిన సంక్షేమమే 2.50 లక్షల కోట్లపైనే. చంద్రబాబు చెబుతున్న అబద్ధాలకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు. సీఎంగా ఉండి ఏనాడైనా పోలవరం పేరు ఎత్తాడా?. పోలవరానికి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడ్డుపడ్డాడని చంద్రబాబు ఎలా అంటారు?. అసలువైఎస్సార్ హయాంలో పోలవరం‌ పనులు ప్రారంభయ్యాయి. కుడి, ఎడమ కాలువలు పూర్తి చేశారు. కమీషన్ కోసం‌ కుక్కుర్తి పడి పోలవరాన్ని నిర్మాణాన్ని చంద్రబాబు చేపట్టలేదా?.ఈనాడు రామోజీరావు వియ్యంకుడికి వందల కోట్ల పనులు అప్పనంగా అప్పగించలేదా? అని నిలదీశారు.►చంద్రబాబు దుర్మార్గుడు. చంద్రబాబు కొడుకు మాలోకం. అది యువగళమా.. విషగళమా?. ఎవరు ఎక్కువ కేసులు పెట్టించుకుంటే వారికే పెద్ద పదవులట!. టీడీపీ అధికారంమలోకి వస్తే కర్రలు ఇస్తాడట. ఇదీ రాబోయే కాలంలో వాళ్ల అజెండా. జోకర్ కొడుకు.. బ్రోకర్ తండ్రి అని పేర్కొన్నారాయన.పవన్‌ని చూస్తే జాలేస్తోందిచిరంజీవి కుటుంబంపై చంద్రబాబు చేసిన కుట్రలు అందరికి తెలుసు. కాపులని అనాదిగా తొక్కడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. రంగా హత్య నుంచి ముద్రగడ కుటుంబాన్ని వేధించే దాకా కాపులని అడుగడుగునా చంద్రబాబు కుట్ర ఉంది. అలాంటి చంద్రబాబు విష కౌగిలిలో పవన్‌ చిక్కకుపోయాడు. పవన్‌ స్టార్ నుంచి ప్యాకేజీ స్టార్ గా మారిపోయాడు. నా పార్టీ పెట్డిన‌ ధ్యేయమే వైఎస్ జగన్ ని గద్దె దించడమే అని పవన్ అంటున్నాడు.పవన్ పై ప్రేమ ఉంటే ప్యాకేజ్ ఇవ్వలేదని ఏనాడైనా చంద్రబాబు చెప్పాడా?. అందుకే చంద్రబాబు విష కౌగిలి నుంచిపవన్బయటపడాలి అని సూచించారు. Tue, Aug 1 2023 7:24 PM
  • ఈనాడుపై జనాగ్రహం విజయనగరం: ఈనాడు తప్పుడు రాతలపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆదివారం చేపట్టిన నిరసనకు ప్రజలు మద్దతు తెలిపారు. ఈనాడు తప్పుడు రాతలు మానుకోవాలి.. లేకుంటే గుణపాఠం తప్పదంటూ నినదించారు. నగరంలో ఆర్‌అండ్‌బీ జంక్షన్‌లోని ఈనాడు కార్యాలయం వరకు ఆదివారం ర్యాలీ నిర్వహించి అక్కడ ఈనాడు దినపత్రిక ప్రతులను దగ్ధం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని 45వ డివిజన్‌ పరిధిలోని కేఎల్‌పురం ప్రాంత ప్రజలకు తాగునీరు అందడం లేదంటూ ఈనాడు ప్రచురించిన కథనంపై కార్పొరేషన్‌ కార్పొరేటర్లు మండిపడ్డారు.ర్యాలీలో తప్పుడు రాతలు రాస్తున్న ఈనాడు డౌన్‌ డౌన్‌ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా 45వ డివిజన్‌ కార్పొరేటర్‌ తాళ్లపూడి సంతోషికుమారి, 39వ డివిజన్‌ కార్పొరేటర్‌ వింత ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ కేఎల్‌ పురంలో దశాబ్దాల కాలంగా తాగునీటి పైపులైన్లు లేకపోవడంతో వాటర్‌ ట్యాంకర్ల ద్వారానే తాగునీటి సరఫరా చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలకు అవస రమైన మేరకు రోజుకు 3 ట్యాంకర్ల నీటిని ప్రస్తుత వేసవిలో సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. 2019 ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఇచ్చిన హామీ మేరకు కేఎల్‌పురంలో శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కారం కోసం రూ.2కోట్లతో వాటర్‌ ట్యాంకు నిర్మించడం జరుగుతుందన్నారు.ఇటీవల జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో రూ.98 లక్షలతో తమ ప్రాంతం పరిధిలో పైప్‌లైన్‌ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయటం జరిగిందని, పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణ దశలో ఉన్న పరిస్థితిని ఈనాడు దినపత్రిక ప్రతినిధులు గమనించకుండా ప్రజలు ఇక్కట్లు పడుతున్నారనే విధంగా తప్పుడు వార్తలను ప్రచురించడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రజలను మభ్యపెట్టే విధంగా ఈనాడు తప్పుడు వార్తలను ప్రచురించ డం క్షమించరానిదని అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి నిరాధార వార్తలు ప్రచురించినట్లయితే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పలు డివిజన్‌లకు చెందిన కార్పొరేటర్లు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Mon, May 15 2023 12:04 PM
  • AP: ప్రాణదాతలపై అసత్య ప్రచారాలు సాక్షి, గుంటూరు:టీడీపీ అనుకూల మీడియా దేన్ని వదలడం లేదు. సీఎం వైఎస్‌ జగన్‌ సారథ్యంలోని సంక్షేమ ప్రభుత్వంపై విషం చిమ్మడమే ధ్యేయంగా పెట్టుకుంది యెల్లో మీడియా. అందునా చంద్రబాబు-రామోజీల ఈనాడు మరీ దారుణం. అందుకే లేనిది ఉన్నట్లు కథనాలు అల్లేసుకుని.. వాటిని తమ మీడియాలో ప్రచురించుకుని ఆనందం పొందుతున్నారు. అయితే వాస్తవాలు వెలుగు చూస్తుండడంతో..నాలుక కర్చుకోవడం ఈనాడు వంతు అవుతోంది.తాజాగా ‘ఆపదలో ఆంబులెన్స్‌’ అంటూ ప్రభుత్వ ఆంబులెన్స్‌ సర్వీసులపై ఈనాడు ఓ కథనం ప్రచురించింది. పైగా ఆంబులెన్స్‌లుటైంకి రావడం లేదంటూ, మూలనపడ్డాయంటూఅందులో లేనిపోని పైత్యాన్ని ప్రదర్శించింది. అయితే.. వాస్తవం ఏంటంటే.. 108 సర్వీస్‌ ద్వారా నెలకులక్ష దాకా ప్రాణాలు కాపాడగలుగుతోంది ప్రభుత్వం. పూర్తి వివరాలను పరిశీలిస్తే.. 108సర్వీస్‌కు సంబంధించిన ఆంబులెన్స్‌లు 768 ఉన్నాయి. వీటిలో ప్రస్తుత ప్రభుత్వం 432 ఆంబులెన్స్‌లను కొత్తగా కేటాయించినవే ఉన్నాయి. వీటి సేవల్లోనూ ఎలాంటి అవాంతరాలు ఎదురు కావడంలేదు. గ్రామీణ ప్రాంతాల్లో.. నిబంధనల ప్రకారం అయితే 20 నిమిషాల్లో, అర్బన్‌ ఏరియాల్లో 15, గిరిజన ప్రాంతాల్లో 30 నిమిషాల్లో 108 సేవలు అందుబాటులో ఉండాలి. కానీ, తాజా లెక్కలను పరిశీలిస్తే.. కేవలం 16, 14, 22 నిమిషాల్లో సేవలను అందించేందుకు అందుబాటులో ఉంటోంది 108 సర్వీసెస్‌. గమ్యస్థానం మరీ దూరంగా ఉండడం, ప్రత్యేక పరిస్థితుల్లో తప్పించి ఈ వాహనాలు త్వరగతినే సేవలను అందిస్తున్నాయి.నాడు-నేడుగత ప్రభుత్వంలో.. 440కి గానూ 336 ఆంబులెన్స్‌లు మాత్రమే రోడ్డెక్కేవి. లక్షా ఇరవై వేల జనాభాకు ఒక ఆంబులెన్స్‌ సేవలు అందిచేది. 86 ఆంబులెన్స్‌ల్లో మాత్రమే అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌ సపోర్ట్‌ వ్యవస్థ ఉండేది. అందులో అడ్వాన్స్‌డ్‌ వెహికిల్‌ లొకేషన్‌ సిస్టమ్‌(AVLS),మొబైల్‌ డాటా టర్మినెల్‌ కూడా ఉండేది కాదు. కానీ, ఇప్పటి ప్రభుత్వ హయాంలో.. 768 ఆంబులెన్స్‌లు ఉన్నాయి. డబ్ల్యూహెచ్‌వో స్టాండర్డ్స్‌కు దగ్గరగా జనాభాకు తగ్గ రీతిలో ఆంబులెన్స్‌ 74 వేలమందికి ఒకటి అందుబాటులో ఉంటోంది. అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌ సపోర్ట్‌ ఆంబులెన్స్‌లు 216 ఉండగా, అందులో 130 కొత్తవి. అన్ని ఆంబులెన్స్‌లో మొబైల్‌ డాటా టర్మినెల్‌ ఉంది. అడ్వాన్సడ్‌ వెహికిల్‌ లొకేషన్‌ సిస్టమ్‌ ఆంబులెన్స్‌ల సంఖ్య దాదాపుగా అన్ని ఆంబులెన్స్‌ల్లో ఉంది.పాత ఆంబులెన్స్‌లు విషయంలో..2019నాటికి ఉన్న 108 సర్వీసు ఆంబులెన్స్‌ల సంఖ్య 440గా ఉండగా, 2022 నాటికి 768కి చేరింది. వీటిల్లో 2020లో 412 కొత్త ఆంబులెన్స్‌లను రోడ్డెక్కించింది వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం. కిందటి ఏడాదిలో 20 కొత్త ఆంబులెన్స్‌లను గిరిజన ప్రాంతాల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక ఇప్పుడున్న 108 ఆంబులెన్స్‌ల్లో.. 336 పాత ఆంబులెన్స్‌లు(గత ప్రభుత్వ ఘనకార్యమే)ఉన్నాయి. వీటిని మార్చేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వగా.. జనవరి 11 2023వ తేదీన ఆరోగ్య, కుటుం సంక్షేమ శాఖ జీవో విడుదల అయ్యింది కూడా. ఈ మేరకు 146 ఆంబులెన్స్‌ల కొనుగోలుకు సంబంధించిన టెండర్‌ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది కూడా.శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన ఓ ఘటనను ఈనాడు కథనం ప్రముఖంగా ప్రచురించింది. ఏపీ16టీహెచ్‌9940 నంబులపూలకుంటకు చెందిన ఆంబులెన్స్‌ ఆగిపోయిందని వెల్లడించింది. అయితే.. తాజాగా ప్రభుత్వం రీప్లేస్‌మెంట్‌ కోసం ఇచ్చిన 146 ఆంబులెన్స్‌ల్లో ఇది కూడా ఒకటి ఉంది. అప్పటికే 4,86,599 కిలోమీటర్లు తిరిగిన ఆ వాహనం.. మోటార్‌ ఇష్యూతో ఆగిపోయింది. జనవరి 13వ తేదీ మధ్యాహ్నాం ఒంటి గంట నుంచి ఆ మరుసటి రోజు సాయంత్రం దాకా అది అలాగే ఉండిపోయింది. రీప్లేస్‌ అయిన వెంటనే కొత్త వాహనం ఆ ప్రాంతంలో సేవలు అందిస్తుందని అధికారులు వెల్లడించారు.ఇక 104 ఎంఎంయూ సేవల విషయంలోనూ క్లారిటీ ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో 292 104ఎంఎంయూ వాహనాలు ఉండగా.. ప్రస్తుతం హయాంలో ఆ సంఖ్య 656గా ఉంది. నెలలో 26 రోజుల పాటు సచివాలయాలు, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లలో సేవలు అందిస్తున్నాయి ఇవి. ఇక త్వరలో ప్రారంభించనున్న ఫ్యామిలీ డాక్టర్‌ ప్రోగ్రాంలో భాగంగా.. అన్ని పీహెచ్‌సీల డాక్టర్లు 104ఎంఎంయూ ద్వారానే సేవలు అందించనున్నారు. ఇందు కోసం 260 కొత్త వాహనాలను కూడా కొనుగోలు చేయడం జరిగింది. విషయం ఏంటంటే.. 2022 అక్టోబర్‌ 21వ తేదీ నుంచి ఈ పథకం పైలట్‌ ప్రాజెక్టుగా అమలులో ఉంది కూడా. త్వరలో పూర్తి స్థాయిలో అమలు కాబోయే ఈ పథకం గురించి కూడా ఈనాడుకు ఏమాత్రం అవగాహన లేన్నట్లుంది.డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ సీఈవో ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్‌(ఐఏఎస్‌) ఒక ప్రకటన విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి Wed, Jan 18 2023 8:02 PM
  • సైకిల్‌ పైనే షాపింగ్‌.. పార్టీ ఆఫీసుల కోసం బరితెగించింది చంద్రబాబే సాక్షి, అమరావతి: నిబంధనలకు లోబడి వైఎస్సార్‌సీపీ కార్యాలయాల కోసం రెండుమూడు చోట్ల రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించడాన్ని చిలవలు పలువలు చేసి రాద్ధాంతం చేస్తున్న ‘ఈనాడు’కు చంద్రబాబు హయాంలో అడ్డగోలుగా టీడీపీ కార్యాల­యాలకు భూ సంతర్పణలు కానరాలేదు. ఐదేళ్ల టీడీపీ పాలనలో రూ.వందల కోట్ల విలువైన భూములు ఆ పార్టీ పరమయ్యాయి.నాడు చంద్ర­బాబు కేవలం తమ పార్టీకే భూములు దక్కేలా 2016లో ఒక జీవో ఇచ్చారు. దాన్ని అడ్డుపెట్టుకుని అత్యంత విలువైన భూములను 33ఏళ్లు, మరికొన్నింటిని 99 ఏళ్ల లీజుపై కారుచౌకగా టీడీపీకి కట్టబెట్టారు. సమీపంలోని ప్రభుత్వ, పేదల స్థలాలను సైతం ఆక్రమించి టీడీపీ కార్యాలయా­లను నిర్మించుకున్నారు. పసుపు రంగుతో కనిపించే విలాసవంతమైన టీడీపీ కార్యాలయ భవనాల వెనుక ఎన్నో దురాగతాలు, అన్యాయాలున్నాయి.రైతుల కడుపుకొట్టి.. వాగు భూమిని ఆక్రమించిప్రస్తుతం చంద్రబాబు దర్జాగా సమావేశాలు నిర్వహిస్తున్న మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయమైన ఎన్టీఆర్‌ భవన్‌ పునాదుల్లో పేద రైతు కుటుంబాలు ఛిద్రమైపోయాయి. జాతీయ రహదారి పక్కన కబ్జా చేసిన స్థలంలో విలాసవంతంగా కార్పొరేట్‌ హంగులతో భవన నిర్మాణంపై కోర్టు కేసులు దాఖలయ్యాయి. ఆత్మకూరు సర్వే నెంబర్‌ 392లో 3.65ఎకరాల భూమిని 99 ఏళ్ల లీజుపై టీడీపీ కార్యాలయానికి చంద్రబాబు కేటాయించుకున్నారు. సుమారు రూ.50కోట్ల విలువైన ఈ భూమిని ఏడాదికి ఎకరానికి రూ.వెయ్యి లీజుపై కేటాయిస్తూ 2017లో చంద్రబాబు ప్రభుత్వం జీవో ఇచ్చింది.అయితే ఇదే భూమిని 1974లో ప్రభుత్వం అదే గ్రామానికి చెందిన బొమ్ము రామిరెడ్డి, కొల్లా రఘురాఘవరావు, కొల్లా భాస్కరరావు మరికొందరు రైతులకు కేటాయించి పట్టాలు ఇవ్వడం గమనార్హం. వారంతా అప్పటి నుంచి అందులో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. తమకు జరిగిన అన్యాయంపై రైతులు కోర్టుకెళ్లి స్టే ఆర్డర్‌ తెచ్చుకున్నా అధికారమదంతో చంద్రబాబు సర్కారు ఖాతరు చేయలేదు. పక్కనే ఉన్న వాగు స్థలాన్ని కూడా పూడ్చేసి టీడీపీ కార్యాలయాన్ని నిర్మించారు. అన్యాయానికి గురైన రైతుల్లో కొందరు టీడీపీ సానుభూతిపరులూ ఉండటం గమనార్హం.బెజవాడ ఆటోనగర్‌లో రూ.25 కోట్ల స్థలంవిజయవాడ నడిబొడ్డున ఆటోనగర్‌–గురునానక్‌ నగర్‌ కాలనీ మధ్యలో ఉన్న 93 సెంట్ల స్థలాన్ని 2016 జూలైలో టీడీపీ కాజేసింది. అప్పట్లోనే దీని విలువ రూ.25 కోట్ల పైమాటే. ఇరిగేషన్‌ శాఖకు చెందిన అత్యంత విలువైన స్థలాన్ని నాటి మంత్రి దేవినేని ఉమ కృష్ణా జిల్లా టీడీపీ కార్యాలయానికి ధారాదత్తం చేశారు. ఇరిగేషన్‌ అవసరాలకు ఈ స్థలం కావాలని అధికారులు చెబుతున్నా వినకుండా జిల్లా పార్టీ అధ్యక్షుడితో స్థలం కోసం దరఖాస్తు చేయించి వెంటనే ఇచ్చేశారు. ఏడాదికి కేవలం రూ.వెయ్యి చొప్పున 33ఏళ్లు లీజుకిచ్చారు.గుంటూరులో కార్పొరేషన్‌ స్థలం కబ్జా..గుంటూరు అరండల్‌పేటలోని వెయ్యి గజాల విలువైన స్థలాన్ని టీడీపీ కారుచౌకగా కొట్టేసింది. ఉమ్మడి రాష్ట్రంలో 1999 జూలై 1న ఈ స్థలాన్ని 30 ఏళ్ల లీజుకు టీడీపీ నేతలు తీసుకున్నారు. అనంతరం ఆ స్థలంతోపాటు పక్కనే ఉన్న 1,637 గజాల కార్పొరేషన్‌ స్థలాన్ని కూడా కబ్జా చేసి పార్టీ కార్యాలయాన్ని నిర్మించేశారు. లీజు డబ్బులను కూడా చెల్లించలేదు. ఆ భవనానికి ఎలాంటి అనుమతులు లేకపోవడం గమనార్హం.దసపల్లా భూముల్లో టీడీపీ ఆఫీసువిశాఖ మహారాణిపేటలోని దసపల్లా భూమిని పార్టీ కార్యాలయం కోసం చంద్రబాబు కేటాయించుకున్నారు. సర్వే నం.1196/7లోని రెండు వేల గజాల స్థలాన్ని 33 ఏళ్ల పాటు ఏడాదికి రూ.25 వేలు చొప్పున లీజుపై టీడీపీ కార్యాలయానికి 2002లో కేటాయించుకున్నారు. 2014లో అధికారంలో ఉండగా అక్కడ పార్టీ కార్యాలయాన్ని కట్టేశారు. పక్కన ఉన్న కొండను తొలగించి 160గజాలు ఆక్రమించి కార్యాలయాన్ని నిర్మించారు.శ్రీకాకుళం దళితుల భూమిలో..శ్రీకాకుళంలో దళితుల ఇళ్ల స్థలాల కోసం సేకరించిన స్థలాన్ని టీడీపీ గుంజుకుని పార్టీ కార్యాల­యాన్ని నిర్మించుకుంది. నగరంలోని 80 అడుగుల రోడ్డులో దళితులకు ఇళ్ల స్థలాల కోసం సాంఘిక సంక్షేమ శాఖ గతంలో భూముల్ని సేకరించి పంచింది. అందులో రెండు ఎకరాలు మిగలగా గురుకుల హాస్టల్‌ కట్టాలని భావించారు. దీనిపై కన్నేసిన టీడీపీ నేతలు 2015 సెప్టెంబర్‌లో కారుచౌకగా 99 ఏళ్లకు ఏడాదికి రూ.25వేల చొప్పున పార్టీ కార్యాలయం కోసం లీజుకు తీసుకున్నారు. దాని విలువ ఇప్పుడు రూ.40 కోట్ల పైమాటే.కాకినాడలో జడ్పీ స్థలం..కాకినాడ కచేరిపేట (మేడ్‌లైన్‌ ప్రాంతం)లోని సర్వే నెంబర్‌ 60/1లో జిల్లా పరిషత్‌కు చెందిన రెండు వేల గజాల స్థలాన్ని టీడీపీ అప్పనంగా సొంతం చేసుకుంది. ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌ పేరుతో ఏటా రూ.25 వేల లీజుతో 99 ఏళ్లకు కేటాయించారు. 2015లో జీవో తెచ్చి వెంటనే పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు. ఇది కాకినాడలోనే అత్యంత ఖరీదైన ప్రాంతం కావడం గమనార్హం.మరికొన్ని నిర్వాకాలివీ..►చిలకలూరిపేటలో నాగార్జున సాగర్‌ కాలువ భూమి 20 సెంట్లు (2017లో)►అనంతపురం జిల్లా రాప్తాడులో 1.10 ఎకరాల దేవుడి మాన్యం►కర్నూలులో 25 సెంట్ల మున్సిపల్‌ స్థలం►చిత్తూరులోని గాండ్లపల్లిలో 1.20 ఎకరాలుఇతరులకు అవకాశం లేకుండా..2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీ కార్యాలయాల ముసుగులో విలువైన భూముల్ని కొట్టేయడానికి చంద్రబాబు పథ­కం రూపొందించారు. అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలు, కుదిరితే మండల కేంద్రాల్లో కూడా భూముల్ని కాజేసేం­దుకు తెర తీశారు. పార్టీ కార్యాల­యాలకు నామమాత్రపు ధరకు 99 ఏళ్ల లీజుపై కేటాయించేందుకు వీలుగా 2016 జూలై 22న ఉత్తర్వులు జారీ చేశారు. టీడీపీ మినహా మరే ఇతర పార్టీకి భూములు దక్కకుండా నిబంధనలు విధించారు. గతంలో హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌ కోసం సీఎం హోదాలో తానే దరఖాస్తు చేసుకుని, తానే కేటాయించుకున్న ఘనచరిత్ర చంద్రబాబుది. Sat, Dec 24 2022 7:41 AM
  • రామోజీకి బ్యాంకులను అప్పగిస్తే అద్భుతంగా నడిపిస్తారేమో Sat, Nov 19 2022 12:19 PM
  • ‘తప్పులను కప్పిపుచ్చుకునేందుకు రామోజీ మీడియాను వాడుకుంటున్నారు’ సాక్షి, రాజమండ్రి: మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కేసు విషయంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అరుణ్‌ కుమార్‌ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘డిసెంబర్‌ 2న మార్గదర్శి కేసు విచారణ ఉంది. డిపాజిట్ల సేకరణ ఆపేసినట్లు 2006లో రామోజీరావు చెప్పారు. డిపాజిట్లను తిరిగి చెల్లిస్తామని హైకోర్టు, సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ వేశారు. కానీ, ఇప్పటికీ డిపాజిట్లు వసూలు చేస్తూనే ఉన్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్‌ పేరు మీదే డబ్బు సేకరిస్తున్నారు.గతంలో డిపాజిట్‌ అని ఉండేది.. ఇప్పుడు రిసీట్‌ అని సేకరిస్తున్నారు. మార్చి 31 నాటికి ఔట్‌ స్టాండింగ్‌ రూ. 139 కోట్లుగా చూపించారు. మార్గదర్శికి 3 శాతం కూడా డీఫాల్టర్లు లేరు.. అందులో కిటుకు ఏంటి?. రామోజీకి బ్యాంకులను అప్పగిస్తే అద్భుతంగా నడిపిస్తారేమో. రామోజీ తెలివితేటలకు పద్మవిభూషణ్‌ కాదు.. భారతరత్న ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ధైర్యంగా మార్గదర్శిలో తనిఖీలు నిర్వహించింది. మార్గదర్శికి ఇవాల్టికీ రామోజీనే ఛైర్మన్‌.. కానీ, కోర్టులో మాత్రం ఆయన ఛైర్మన్‌ కాదంటున్నారు.రామోజీకి రెండు టోపీలు ఉన్నాయని సుప్రీంకోర్టు జడ్జీ చెప్పారు. రామోజీ టోపీల్లో ఒకటి మీడియా, రెండోది ఇండస్ట్రీయలిస్ట్‌. వ్యాపారవేత్తగా చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మీడియాను వాడుకుంటున్నారు.ఏ వ్యాపారమైనా చట్టానికి లోబడే చేయాల్సిందే. రామోజీ చట్టాన్ని ఉల్లంఘించినట్టు రికార్డులే చెబుతున్నాయి. మార్గదర్శి స్కామ్‌పై సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జితో విచారణ చేయించాలి’ అని డిమాండ్‌ చేశారు. Sat, Nov 19 2022 11:59 AM
  • గన్ షాట్ : ఎల్లో మీడియా రాతల్ని ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా..? Sat, Nov 12 2022 7:32 PM
  • ఇక్కడే బతికి విశాఖపై ఈనాడు విషం చిమ్ముతోంది: మంత్రి అమర్నాథ్‌ సాక్షి, విశాఖపట్నం: ఎల్లో మీడియాకు ఇప్పుడు విశాఖ గుర్తుకు వచ్చిందని పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఈనాడు విశాఖలోనే పుట్టిందని గుర్తుంచుకోవాలని సూచించారు. ఇక్కడ బతికి విశాఖపై ఈనాడు విషం చిమ్ముతోందని ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు తెలంగాణ కంటే వెనుకబడిన ప్రాంతాలని శ్రీ కృష్ణ కమిషన్ ఎప్పుడో చెప్పందని ప్రస్తావించారుచంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్రకుఏం చేశారని మంత్రి అమర్నాథ్‌ ప్రశ్నించారు. గిరిజన ప్రాంతానికి మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన ఘనత సీఎం జగన్‌దేనని కొనియాడారు. విశాఖ గర్జన పక్కదారి పట్టించేందుకుటీడీపీ నీచ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు.ఉత్తరాంధ్రను ఉత్తి ఆంధ్రగాటీడీపీ తయారు చేసిందన్నారు.అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టు ఉత్తరాంధ్ర విషయంలో టీడీపీవ్యవహరిస్తోందని విమర్శించారు.‘తెలంగాణఉద్యమం హైదరాబాద్ కోసం వచ్చింది.అమరావతి ఒకే రాజధాని అయితే మరో ఉద్యమం జరుగుతోంది. అమరావతి యాత్ర చేస్తున్న వర్గాల వల్ల ఇప్పుడు ఉత్తరాంధ్ర ఉద్యమం తీవ్రస్థాయికి వచ్చింది.మా ఉత్తరాంధ్రపై మీ దండయాత్ర ఏంటని అన్ని వర్గాలు ఇప్పుడు ప్రశ్నిస్తున్నాయి.భిన్న మనస్తత్వం ఉన్న ఉత్తరాంధ్ర ప్రజలు సరైన సమయంలో స్పందిస్తారు.విశాఖ గర్జన విజయవంతం చేయడానికి ప్రజలు అన్ని స్థాయిల్లో సిద్ధం అవుతున్నారు’. అని మంత్రి పేర్కొన్నారు. చదవండి:అంతర్గత రహస్యాలున్నాయ్‌.. జూనియర్‌ ఎన్టీఆర్‌పై వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు Wed, Oct 12 2022 5:49 PM
  • వైఎస్ జగన్ ప్రభుత్వంపై రామోజీ బురద రాతలు Thu, Aug 25 2022 8:49 AM
  • ఏది నిజం?: తడబాటు కాదు...అధికారపు ఎడబాటు ఒక వ్యవస్థను చక్కదిద్దాలంటే ఒక్క రోజులో సాధ్యమా? పునాదుల నుంచే చెదలు పట్టేసి... నారాయణలు,చైతన్యలు ఆక్రమించేసి... ప్రభుత్వ స్కూళ్లంటేనే భయపడుతూ... చచ్చో చెడో నిరుపేదలు సైతం ప్రయివేటు స్కూళ్లకే పిల్లలను పంపిస్తున్న వ్యవస్థ ఇది. అలాంటి వ్యవస్థను మార్చడానికి నిబద్ధతతో అడుగులు వేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. ఆ అడుగుల్ని సైతం సరిగా పడనీయకుండా సవాలక్ష అడ్డంకులు. రాష్ట్రంలో సర్కారీ విద్యను సర్వనాశనం చేసేసిన చంద్రబాబు నాయుడు... ఆ బాబుతోనే తమ మనుగడ అని భావించే ముగ్గురు మీడియాధిపతులు!!. రాష్ట్రం సర్వనాశనమైపోయినా సరే... తామే ఏలాలనుకునే ఈ చతుష్టయం ఇప్పుడు సర్వశక్తులూ ఒడ్డుతోంది. రాష్ట్రంలో విద్యారంగంలో జరుగుతున్న మేలుకు ప్రజలంతా ఆకర్షితులవుతున్నా... వీళ్లు మాత్రం లేనిపోని రాతలతో విషం కక్కడానికి నిత్యం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ‘తడబడిన విలీనం’ అంటూ సోమవారం ‘ఈనాడు’ పతాక శీర్షికల్లో అచ్చేసిన కథనం ఇలాంటిదే. అసలిందులో నిజం ఏ కోశానైనా ఉందా?అంగన్‌వాడీల నుంచి మొదలుపెడితే చంద్రబాబు హయాంలో విద్యా వ్యవస్థను చూసినంత హీనంగా ఏ వ్యవస్థనూ చూడలేదనే అనుకోవాలి. ఎందుకంటే ఆయన దృష్టంతా కార్పొరేట్‌ స్కూళ్లపైనే. ఏకంగా కార్పొరేట్‌ డాన్‌ నారాయణను తెచ్చి కేబినెట్లోనే పెట్టుకున్న చరిత్ర బాబుది. అంగన్వాడీల్లో ప్రత్యేక కిచెన్‌ గానీ, ప్లేగ్రౌండ్‌ గానీ ఉండేవి కాదు. సిబ్బందే సరిగా లేని దుస్థితి. ఇక 1 నుంచి 5 వరకు నడిచే స్కూళ్లకు ఒకరిద్దరు ఎస్‌జీటీలే దిక్కు. విద్యార్థులకు సదుపాయాలు దేవుడెరుగు. తరగతి గదులూ కొరతే. 18 సబ్జెక్టుల్ని ఆ ఒకరిద్దరు టీచర్లే బోధించేవారు.అప్పర్‌ ప్రయిమరీ స్కూళ్లు, హైస్కూళ్లదీ అదే గతి. అనేక యాజమాన్యాల పరిధిలో ఉండటంతో హై స్కూళ్ల నడుమ సంబంధాలూ ఉండేవి కాదు. ఈ చదువుల దెబ్బకు పిల్లలు తమ తరగతి పుస్తకాల సంగతి అటుంచి... కింది తరగతుల పుస్తకాలనూ చదవలేని దుస్థితికి జారిపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేసే నేషనల్‌ అకడమిక్‌ సర్వే (న్యాస్‌), ప్రథమ్‌ సంస్థ చేసిన ‘అసర్‌’ సర్వే... అన్నీ తేల్చింది ఇదే.విచిత్రమేంటంటే పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా... మేకప్‌ వేసి, తమ కార్పొరేట్‌ స్కూళ్ల కడుపు నింపడానికే ప్రయత్నించారు చంద్రబాబు. కార్పొరేట్‌ కాలేజీల్లోకి విద్యార్దుల చేరికలను పెంచడానికి టార్గెట్లు పెట్టి... కాపీయింగ్‌ను ప్రోత్సహించి మరీ టెన్త్‌లో కృత్రిమ ఉత్తీర్ణత సాధించారు. కార్పొరేట్‌ కాలేజీల్లో చేరి... ఆ తరవాత సరైన నైపుణ్యాలు లేక... జీవితాలనే కోల్పోయిన ఎంతో మంది ... బాబు బ్రెయిన్‌ చైల్డ్‌లే!. కాకపోతే ఇంతటి ఘోరమైన పరిస్థితుల్ని ‘ఈనాడు’ ఏనాడూ ప్రశ్నించలేదు. రామోజీ ఒక్క అక్షరమూ రాయలేదు. ఇపుడు మాత్రం పునాదుల నుంచి జరుగుతున్న మార్పును తట్టుకోలేకపోతుండటమే అన్నిటికన్నా దారుణం.మొత్తం వ్యవస్థకే చికిత్స...!ఇదేదో ఒక రోడ్డో, ఒక వంతెన సమస్యో కాదు. విద్యా వ్యవస్థ. పునాదుల నుంచీ కుళ్లిపోయింది. అందుకే వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక కాయకల్ప చికిత్స మొదలెట్టారు. దేశంలో ఏ ముఖ్యమంత్రీ చూపించనంత శ్రద్ధతో నెలకు రెండు సార్లు సమీక్షిస్తూ... ఫౌండేషన్‌ విద్య నుంచే శ్రీకారం చుట్టారు. దాదాపు 56వేల స్కూళ్లను ‘నాడు–నేడు’ పథకంతో సమూలంగా మార్చే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలిదశలో 15,715 స్కూళ్లను సమగ్ర మౌలిక సదుపాయాలతో సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేశారు. మిగిలిన స్కూళ్లలోనూ 2వ, 3వ విడతల్లో ఈ సదుపాయాలు కల్పిస్తున్నారు. ఈ మూడేళ్లలో 70కి పైగా సమీక్షలు విద్యారంగంపైనే నిర్వహించారంటే సీఎం చిత్తశుద్ధి చెప్పకనే తెలుస్తుంది.మంచిని ఏమాత్రం గుర్తించని చతుష్టయం...నిజానికి పాఠశాల విద్యలో కనీవినీ ఎరుగని సంస్కరణలు మొదలయ్యాయి. దీనికి పొరుగు రాష్ట్రాలే కాదు... కేంద్ర సంస్థలూ ప్రశంసలు కురిపిస్తున్నాయి. కానీ చంద్రబాబుతో కూడిన చతుష్టయం... తమ రాతల్లో ఏనాడూ ఒక్క మంచి పనిని ప్రస్తావిస్తే ఒట్టు. దేనిపైనయినా బురద చల్లటమే. నాడు–నేడు కింద స్కూళ్ల రూపురేఖలు మార్చటంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని జగనన్న గోరుముద్దగా అందిస్తూ... పిల్లల్ని స్కూళ్లకు పంపించే తల్లులకు బాసటగా ‘అమ్మ ఒడి’ పేరిట నగదు జమచేస్తున్న ప్రభుత్వం... జగనన్న విద్యాకానుకగా పుస్తకాలు, యూనిఫామ్, షూస్, డిక్షనరీ తదితర వస్తువుల్ని స్కూళ్లు మొదలుకాకముందే ఉచితంగా అందిస్తోంది.గతంలో స్కూళ్లు ఆరంభమై 6 నెలలు గడిచినా పుస్తకాలే చూడని విద్యార్థులకు ఆరంభం కాకముందే అన్నీ ఉచితంగా అందించటమనేది ఈ దుష్ట చతుష్టయానికి ఏమాత్రం మింగుడుపడటం లేదు. తమ పిల్లలు మాత్రమే ఇంగ్లీషు మీడియం చదవాలన్న ఉద్దేశంతో చివరికి కోర్టులకు కూడా వెళ్లి ఆంగ్ల విద్యను రకరకాల మార్గాల్లో వ్యతిరేకించిన తీరు వీళ్లది.. రెండు భాషల్లో ప్రచురించిన పుస్తకాలు... ఏకంగా ఎన్‌సీఈఆర్‌టీ ప్రశంసలు కూడా అందుకున్నాయి. ఇక పెద్దపెద్ద కార్పొరేట్‌ స్కూళ్లకే సాధ్యమైన ఎడ్యుటెక్‌ కంపెనీ బైజూస్‌ ఆన్‌లైన్‌ పాఠాలను రాష్ట్ర సర్కారీ స్కూళ్ల 8వ తరగతి విద్యార్థుల ట్యాబ్లెట్లలోకి తెచ్చిన ఘనత కూడా సీఎం జగన్‌దే.దశల వారీగా అన్ని ప్రభుత్వ స్కూళ్లనూ సీబీఎస్‌ఈకి (సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌) అనుసంధానిస్తున్నారు. విద్యా వ్యవస్థపై ప్రత్యేక శ్రద్ధతో... విద్యార్థులకిస్తున్న జగనన్న విద్యా కానుక కిట్లను స్వయంగా చూస్తున్నారు సీఎం. గోరుముద్దను ఆయనే రుచిచూస్తున్నారు. పిల్లల పొట్టలు నిండితేనే అక్షరాలు బుర్రకెక్కుతాయని గట్టిగా విశ్వసిస్తూ రుచికరమైన మెనూను తనే రూపొందిస్తున్నారు. ఇదిగో... వీటన్నిటి ఫలితమే... పొరుగు రాష్ట్రాలకు పూర్తి భిన్నంగా రాష్ట్రంలో ప్రయివేటు పాఠశాలల్లో పిల్లలు తగ్గి... ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పెరిగాయి.సాక్షాత్తూ కేంద్రమే పార్లమెంటు సాక్షిగా ఈ విషయాన్ని వెల్లడించింది. వీటిక్కూడా పచ్చ రంగు పులుముతూ... ప్రజల ఆర్థిక స్థితిగతులు దెబ్బతిన్నాయి కనక ప్రయివేటు స్కూళ్లు వదిలి ప్రభుత్వ స్కూళ్లకు వస్తున్నారని వక్రభాష్యాలు చెబుతున్న చరిత్ర రామోజీరావుది. ఏం! పక్క రాష్ట్రాల్లో కరోనా రాలేదా? అక్కడ జనం ఆర్థిక పరిస్థితులు దెబ్బతినలేదా? వాళ్లెందుకు ప్రభుత్వ స్కూళ్లలోకి మారలేదు? ప్రయివేటు స్కూళ్లలో అడ్మిషన్లెందుకు పెరుగుతున్నాయి? ఇక్కడ సర్కారీ స్కూళ్లు అద్భుతంగా రూపుదిద్దుకుంటున్నందుకే కదా... జనం వాటికి మారుతున్నారు? ఆ మాత్రం తెలుసుకోలేరా రామోజీరావు గారూ..?అసలు 3వ తరగతి నుంచి సబ్జెక్టు టీచర్లను తేవాలన్న ఆలోచన మీకు గానీ, మీ బాబుకు గానీ ఏనాడైనా వచ్చిందా? ఇలాంటి ప్రయత్నాల్ని అభినందించటం మీకిష్టం లేకపోతే కనీసం వ్యతిరేకించకుండా అయినా ఉండాలి కదా? మీరొక పత్రికాధిపతి అని, మీ పత్రికను చదివేది తెలుగుదేశం కార్యకర్తలు మాత్రమే కాదని ఇంకెప్పుడు తెలుసుకుంటారు? మీ పాఠకులను గౌరవించటం ఎప్పుడు నేర్చుకుంటారు?ఇదీ... స్కూళ్ల మ్యాపింగ్‌ తీరు► వీలున్న చోట అంగన్వాడీ కేంద్రాలను పాఠశాలలకు అనుసంధానించి వారికి స్కూలు వాతావరణాన్ని అలవాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.► 8 ఏళ్లలోపు పిల్లల్లోనే బ్రెయిన్‌ అభివృద్ధి ఎక్కువ కనక... ప్రాథమిక పాఠశాలలకు అంగన్వాడీ కేంద్రాల్ని అనుసంధానించి ఫౌండేషన్‌ స్కూళ్లుగా మారుస్తున్నారు.► తరగతులను ఇతర స్కూళ్లకు అనుసంధానం చేసేటప్పుడు విద్యార్ధులకు ఇబ్బందిలేకుండా ఉండేలా 250 మీటర్ల నుంచి 1 కి.మీ. పరిధిలో ఉండే వాటిని మాత్రమే విలీనం చేసేలా విద్యాశాఖ స్పష్టమైన మార్గదర్శకాలను జారీచేసింది. నెలల తరబడి కసరత్తు.. క్షేత్రస్థాయి పరిశీలన చేశాకే చర్యలు చేపట్టారు. – దశల వారీగా శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమంలో.. 820 వరకు స్కూళ్లకు సంబంధించి సమస్యలు ఉన్నట్లు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి రాగా... వాటిపై జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి... వాటికి పరిష్కార బాధ్యతలు అప్పగించారు. కాకపోతే ఇవేవీ రామోజీరావుకు పట్టవు. విలీనంపై గాలి వార్తలు రాయటం ద్వారా తల్లిదండ్రుల్లో లేనిపోని అనుమానాలు సృష్టించి... ఏదో ఒకరకంగా ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాలన్నది ఆయన దింపుడుకళ్లం ఆశ.మిగిలిన స్కూళ్లు సైతం...శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూళ్లు, ఫౌండేషన్‌ స్కూళ్లు, ఫౌండేషన్‌ ప్లస్‌ స్కూళ్లు, ప్రీహైస్కూళ్లు, హైస్కూళ్లు, హైస్కూళ్లు ప్లస్‌గా వర్గీకరించి... అన్నిటా విద్యార్ధులకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. అవసరమైన చోట నాడునేడు రెండో విడతలో ప్రత్యేకంగా అదనపు తరగతి గదుల నిర్మాణాన్నీ చేపట్టారు. కాకపోతే ఈ నిర్మాణాలన్నీ ఒక్కరాత్రిలో పూర్తయ్యేవి కావు. వేల కోట్ల నిధులతో పాటు పక్కా ప్రణాళిక, పర్యవేక్షణ అవసరం. వేగంగా అడుగులేస్తూ ఒక్కొక్కటీ పూర్తి చేసుకుంటూ వెళుతున్న జగన్‌ ప్రభుత్వానికి... అసలు ఈ దిశగా జీవితంలో ఎన్నడూ ఆలోచించని చతుష్టయం నుంచి వ్యతిరేకత రావటమే ఘోరాతిఘోరం.► ఇక మ్యాపింగ్‌ పూర్తయిన స్కూళ్లలోని విద్యార్ధులకు సబ్జెక్టు టీచర్ల ద్వారా బోధనకు వీలుగా అదనపు స్కూల్‌ అసిస్టెంటు టీచర్లను విద్యాశాఖ ఏర్పాటు చేయిస్తోంది. ఇందుకోసం 8,233 మంది ఎస్జీటీ టీచర్లకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించడానికి ఏర్పాట్లు చేసింది. కొన్ని చోట్ల పలు పోస్టులను స్కూల్‌ అసిస్టెంటు స్థాయికి అప్‌గ్రేడ్‌ చేపట్టింది.ఆ ఫోటోల వెనక ఎన్నో అర్థసత్యాలు...సోమవారంనాడు ప్రచురించినఫోటోల్లో ‘ఈనాడు’ చెప్పని నిజాలివీ...► శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పంచాయతీ పెద్దపేట స్కూల్‌కు వెళ్లాలంటే 35 ఎకరాల చెరువు దాటి వెళ్లాల్సి వస్తోందనేది ‘ఈనాడు’ కథనం సారాంశం. స్కూలు వెనుక భాగాన చెరువు ఉంది. దాన్ని దాటే పనిలేదు. ఆ స్కూలుకు రెండు వైపులా రోడ్లున్నాయి. కేవలం అరకిలోమీటర్‌ పరిధిలోని స్కూలులోని పిల్లలను ఈ స్కూలుకు మ్యాపింగ్‌ చేయడంతో తల్లిదండ్రులు కూడా దీన్నిఆహ్వానించారు.► ఏలూరు జిల్లా ఉంగుటూరులోని మ్యాపింగ్‌ అయిన స్కూల్లో విద్యార్దులకు సరిపడే ఫర్నీచరు వేసి విద్యార్థులు ఉపాధ్యాయులు కూర్చోబెట్టారు. లక్షలాది రూపాయలు వెచ్చించి నాడు– నేడు పనులు చేస్తున్న కారణంగా రెండు రోజులుగా గదులు సర్దుబాటు చేసున్నారు. తాత్కాలికంగా కూర్చోబెట్టిన ఫోటోను తీసి... శాశ్వతంగా వసతులు లేవన్నట్లు రాయటమే ‘ఈనాడు’ పైత్యానికి పరాకాష్ట.► రాచూరు హైస్కూల్లో 3,4,5 తరగతుల విధ్యార్దులను కలిపి కూర్చొబెట్టినట్లు వచ్చిన వార్త పూర్తిగా అబద్ధమే. నాడు నేడు పనులు జరుగుతున్న కారణంగా తాత్కాలికంగా ఇలా సర్దుబాటు చేశారు తప్ప గదులుపూర్తవ్వగానే ఆయా గదుల్లోకి తరగతులను మారుస్తారు. ఇక్కడ ఒక్కోగదికి 12 లక్షలు చొప్పన రెండు అదనపు గదులను ప్రభుత్వం నిర్మిస్తోంది. Tue, Aug 2 2022 12:10 PM
  • అబద్ధాలకు హద్దేముంది? ‘ఈనాడు’కు సిగ్గేముంది? అబద్ధాలకు హద్దేముంది? ‘ఈనాడు’కు సిగ్గేముంది? పతాకశీర్షికల్లో చెప్పినంత మాత్రాన అబద్ధం నిజమైపోతుందా?మీరేం రాస్తే అది నిజమైపోవటానికి ఇవి వైస్రాయ్‌ రోజులనుకున్నారా రామోజీరావు గారూ? కూలీల ఫొటోలు తీసివారు రైతులంటూ.. దోపిడీకి గురయ్యారంటూ దుర్మార్గపురాతలు రాస్తే ఎలా? వారి చేతికందిన సొమ్మును కూడాఅందలేదని రాస్తే ఎలా? ఏది నిజమో... ఏది మీ నైజమోచెప్పటానికి మరో మీడియా లేదనుకున్నారా? ఫోటోలతోసహా మీరు వేసిన అబద్ధాలను... వీడియోలతో సహావివరించడానికి ‘సాక్షి’ ఉందిక్కడ. మీ ‘బాబు’ కోసం జనంమెదళ్లలో ప్రభుత్వంపై విద్వేష భావాలు నాటడానికిఈ వయసులో కూడా ఇన్ని కాకిలెక్కలు మీకు అవసరమా?కనీసం ఇన్నాళ్లు మీ పత్రికను నమ్మిన జనం కోసమైనానిజాలు చెప్పరా?ఆంధ్రప్రదేశ్‌లోని రైతు భరోసా కేంద్రాలకు పొరుగు రాష్ట్రాలే కాదు.. కేంద్రంతో పాటు అంతర్జాతీయ సమాజమూ సలాం కొడుతోంది. ‘విత్తు నుంచి విక్రయం వరకూ’ అనే నినాదంతో ఊరూరా రైతన్నకు భరోసాగా నిలుస్తున్న ఈ కేంద్రాలు రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని కొత్త దారిలో నడిపిస్తున్నాయి. అందుకే రామోజీ పథకం ప్రకారం గురువారం ‘ఈనాడు’ పతాక శీర్షికలో ‘ధాన్యంలో దోపిడీ’ అంటూ వీలైనన్ని అబద్ధాలు పోగేశారు. రైతు భరోసా కేంద్రాల్లో అన్నదాతకు భరోసాయే దక్కటం లేదంటూ మొత్తం వ్యవస్థపైనే విషం గక్కారు.విశేషమేంటంటే చంద్రబాబు హయాంలో రైతు భరోసా కేంద్రాల మాట అటుంచి.. రైతుకు భరోసాయే లేదు. ధాన్యం సేకరించాలంటూ రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తే అప్పుడు కొనుగోళ్లకు ఉపక్రమించిన చరిత్ర బాబుది. ఆయన ఐదేళ్ల పాలనలో 2.81 కోట్ల టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించగా.. ఇందుకు రూ.43,134 కోట్లు అయితే, ఇందులోనుంచి రూ.4,838 కోట్లను ఎన్నికల్లో గెలుపుకోసం పసుపు కుంకుమకు మళ్లించారు. తర్వాత వచ్చిన సీఎం జగన్‌ ఆ బకాయిలనూ తీర్చి రైతులను గట్టెక్కించారు. అంతేకాదు.. జగన్‌ ఈ మూడేళ్లలోనే 2.33 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరించి, ఏకంగా 43,549 కోట్లు చెల్లించారు.రామోజీది ఎంత నిఖార్సయిన జర్నలిజం అంటే.. బాబు ఏమిచేసినా ఆయనకు తప్పు అనిపించదు. ఇప్పుడు ప్రతిదీ తప్పుగానే కనిపిస్తుంది. నిజాలు ఎప్పుడూ చెప్పరు!!. అప్పట్లో సేకరించలేదనికానీ... ఇప్పుడు సేకరిస్తున్న విషయాన్ని కానీ నిజాయితీగా అంగీకరించరు. ఈ ఏడాది ఇప్పటికే ప్రభుత్వం 6.68 లక్షల రైతులకి చెందిన 52.54 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించిందంటే రైతులకు ఎంత దన్నుగా నిలుస్తున్నదో అర్థమవుతుంది.ఆర్బీకే అంటేనే... భరోసాపంట విక్రయానికి సంబంధించి పూర్తి పారదర్శకత ఉండాలన్నదే ఆర్బీకేల లక్ష్యం. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరకు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ నేరుగా కొనుగోలు చేయడానికే ఈ ఏర్పాటు. ఆర్బీకేల ద్వారా మద్దతు ధరకు అమ్మాలనుకున్న రైతులు తొలుత వారి పంట, బ్యాంకు ఖాతా వివరాలను ఈ–క్రాప్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవటం తప్పనిసరి. దీన్నిబట్టే ఆర్బీకేలు సేకరణ మొదలెడతాయి. ఇక రైతుల ఖాతాల్లోకి నేరుగా ఆన్‌లైన్‌లో నగదు చేరిపోతుంది.16నే మేకా సూర్యనారాయణకు హమాలీ చార్జీని చెల్లించిన చెక్కు ఈ మేరకు వీలు కల్పించే ధాన్యం సేకరణ పోర్టల్‌ను ఎలాంటి ఇబ్బందులూ లేకుండా టీసీఎస్‌ సంస్థ నిర్వహిస్తోంది. ఈ–క్రాప్‌లో నమోదు చేసుకోకున్నా... కౌలు రైతు కార్డు లేకున్నా అలాంటి వారు ఒకరో ఇద్దరో ఇబ్బంది పడొచ్చు. కానీ దాన్ని సార్వత్రికం చేస్తూ... యావత్తు రైతాంగం దోపిడీకి గురయిపోతున్నారని రామోజీ ఆక్రోశించటమే దుష్ప్రచార యుద్ధంలో కీలక ఘట్టం.ఆర్బీకేల ద్వారా సమీకరించేందుకు అవసరమైన గోనె సంచులను ప్రభుత్వమే సరఫరా చేయటంతో పాటు... హమాలీ చార్జీలనూ అందజేస్తోంది. అందరి ఖాతాల్లోనూ ఈ సొమ్ము పడుతున్నా... ఎవ్వరికీ దీని గురించి తెలియదన్నట్లుగా రాయటమే చిత్రాతిచిత్రం.నాణ్యమైన బియ్యం కోసం..బాబు హయాంలో సేకరించటమే అరకొరయితే... అలా సేకరించిన దాన్లో ముక్కిపోయిన, నూకలుగా మారిపోయిన బియ్యాన్ని మాత్రమే రేషన్‌ డిపోలకు సరఫరా చేసేవారు. అప్పట్లో రేషన్‌ బియ్యం తినేవారు అతితక్కువ. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయటానికి ముఖ్యమంత్రి అన్ని చర్యలూ తీసుకోవటంతో... దీనికి అవసరమైన సార్టెక్స్‌ రైస్‌ను మిల్లింగ్‌ చేయడానికి రైస్‌ మిల్లులకు అదనంగా క్వింటాలుకు రూ.110 చొప్పున చెల్లించాల్సి వస్తోంది.ఫోర్టిఫైడ్‌ బ్లెండింగ్‌ కోసమూ అదనపు మిల్లింగ్‌ చార్జీలు చెల్లిస్తున్నారు. అందుకే నాణ్యమైన బియ్యం రేషన్‌ కార్డు దారులకు చేరుతోంది. వారంతా తమ ఇళ్లలో వీటిని వాడుతున్నారు. కాకపోతే ఈ నిజాలేవీ ‘ఈనాడు’ రాయదు. రైతు కూలీల్ని ఫోటోలు తీసి... రైతులంటూ అబద్ధపు రాతలు మాత్రం రాస్తుంది. ఎందుకంటే రామోజీ లక్ష్యం... అడ్డూ అదుపూ లేని దుష్ప్రచారం మరి!!.రామోజీ రాసిన ఈ రైతుల సంగతి చూస్తే... ఇన్నాళ్లూ అబద్ధాలను ‘ఈనాడు’ ఎంత అందంగా అచ్చేసిందో అర్థమవుతుంది. ఒక్కో రైతు కథనూ చూస్తే...‘ఈనాడు’ రాతల ప్రకారం రామచంద్రపురం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన ఉండవల్లి వీరభద్రరావు నాలుగెకరాల్లో వరి వేశారు. షావుకారులే కొంటున్నారని, బస్తాకు రూ.1,380 ఇస్తామన్నారని, అంతకన్నా ఎక్కువ జమయితే తెచ్చి కమీషన్‌ దారుకు ఇవ్వాలన్నారని ఆయన చెప్పినట్లు రాశేశారు. పోయిన పంటకూ ఇలాగే చేసారని, హమాలీ, రవాణా చార్జీలు ఇస్తారనే విషయం తమకు తెలియదన్నట్లు కూడా రాశారు.కానీ నిజమేంటో తెలుసా?ఉండవల్లి వీరభద్ర రావు పేరిట పొలం లేదు. ఆయన భార్య ఉండవల్లి పద్మావతి పేరిట పొలం ఉండటంతో అమ్మిన ధాన్యం సొమ్ము ఈ ఏడాది జనవరి 3న NPCI ద్వారా నేరుగా రైతు ఖాతాలో (యూనియన్‌ బ్యాంక్‌ ) జమ అయింది. హమాలీ చార్జీల రూపేణా ఈ నెల 4న రూ.1,740 జమయింది. దీన్ని పద్మావతి స్వయంగా చెప్పారు. ఐదు నెలల కిందట సొమ్ము జమైనా... నెల కిందట హమాలీ చార్జీలు వచ్చినా... ఈ అబద్ధపు రాతలెందుకు? ఎవరిని నమ్మించడానికి?రామోజీ రాతల ప్రకారం రామచంద్రపురం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన మేకా వీర సూర్యనారాయణ 12 ఎకరాల్లో వచ్చిన ధాన్యం అమ్మారు. లిస్టులో పేరున్నా డబ్బులివ్వడం లేదు. అమ్మి 5 నెలలైనా ఇప్పటిదాకా హమాలీ చార్జీలు ఇవ్వలేదు. డీసీసీబీకి వెళ్లినా పనికాలేదు!!.ఆర్బీకే ఇచ్చిన రసీదుఇక వాస్తవం చూద్దాం...రైతు మేకా వీర సూర్యనారాయణ అమ్మిన ధాన్యము యొక్క హమాలీ చార్జీలు రూ.2,520 ఈ నెల 16నే చెక్కు రూపంలో ఆయనకు అందాయి. ఇది ఆయనే అంగీకరించారు. కానీ.. రామోజీ తనకు తోచినట్లు రాసేశారు.‘ఈనాడు’ కథనం మేరకు... రాయవరం మండలం నదురుబాద గ్రామానికి చెందిన కొండపల్లి వెంకట సత్యనారాయణ అనే రైతు ఐదున్నర ఎకరాల్లో వరి వేశారు. బస్తా రూ.1,380కి అమ్మారు. తామే మిల్లుకు తీసుకెళితే బస్తాకు రూ.1,455 ఇస్తారన్నారని, లేకుంటే రూ.1,380 ఇస్తామన్నారని, ధాన్యాన్ని మిల్లుకు తీసుకెళ్లాక నెమ్ము చేరిందన్నారని, ఎంత తరుగు తీసేస్తారో తెలియడం లేదని ఆయన వాపోయినట్లు రాసిపారేశారు.కానీ వాస్తవమేంటో తెలుసా?కొండపల్లి వెంకట సత్యనారాయణ కౌలు రైతు అని ‘ఈనాడు’ రాసింది తప్ప... ఆయన ఎక్కడ కౌలు రైతుగా నమోదు చేసుకున్నారో రాయలేదు. ఆయన కూడా... తానెక్కడా నమోదు చేసుకోలేదని, తనకు సీసీఆర్‌సీ కార్డు కూడా లేదని స్పష్టం చేశారు. మరి ఈ–క్రాప్‌లో నమోదు కాకుండా ఆ పంటనెలా కొంటారు? సీసీఆర్‌సీ కార్డు లేనిదే కౌలు రైతు ఎలా అవుతారు? రాసేముందు ఈ మాత్రం చూసుకోవద్దా రామోజీరావు గారూ?ఇక రామోజీ రాతల్లో డొల్లెంతో చెప్పటానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ప్రత్తిపాడు గ్రామంలో మన్యం గోపాలకృష్ణ ఐదెకరాల్లో వరి వేసారని, ఎకరాకు 30–35 బస్తాలొస్తుండగా 3 రోజులుగా ఎండబెడుతున్నారని రాశారు. రైతు భరోసా కేంద్రాలకు వెళ్తే ఈ తిప్పలు పడలేరు, కమీషన్‌.దారులకు ఇచ్చేయమన్నారని... మిల్లులకు తీసుకెళితే తేమ, నూక తేడా ఉంటే బస్తాకు రూ.200/– కోత పెడతామన్నారని, ఆర్బీకేల్లో సంచులు ఇవ్వడం లేదని ఆయన , చెప్పినట్లుగా రాసేశారు. అందుకే కమీషన్‌ దారులకు ధాన్యం ఇస్తున్నారని సూత్రీకరించారు.‘ఈనాడు’ రాయని నిజమేంటంటే మన్యం గోపాల కృష్ణ వ్యవసాయ కూలీ. తనకు పొలం లేదు. ఆయన పొలంలో ధాన్యం పట్టుబడి చేస్తుంటే ‘ఈనాడు’ బృందం వెళ్లి ఫోటో తీసుకుంది. పేపర్లో ఏం రాశారో తనకు తెలియదని, తానైతే వాళ్లతో ఏమీ చెప్పలేదని ఆయన వాపోయాడు. తమ గ్రామంలో రైతు భరోసా కేంద్రాల ద్వారానే మద్దతు ధరకు ధాన్యాన్ని కొంటున్నారని, సంచుల కొరత లేదని కూడా చెప్పాడు.ఈనాడు, ఆంధ్రజ్యోతి వక్రీకరిస్తున్నాయి..జగన్‌ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టాక రైతుల కోసం రైతు భరోసా, సున్నా వడ్డీ రుణాలు, అధిక మద్దతు ధర, ఉచిత విద్యుత్, భూ రికార్డుల ప్రక్షాళన, కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల వంటి విప్లవాత్మక చర్యలు తీసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లకు దేశంలోనే అతిపెద్ద వ్యవస్థను ఏర్పాటు చేశారు. అయితే క్షేత్ర స్థాయిలో కొన్ని చోట్ల రైసు మిలర్ల పాత్ర వల్ల రైతులు నష్టపోతున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశా.కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతిల్లో మొత్తం వ్యవస్థ తప్పుగా ఉందని నేనన్నట్లు వక్రీకరించి రాశారు. ఇది సరికాదు. నేను ఈ అంశాన్ని చెప్పిన వెంటనే వ్యవసాయ మంత్రి, పౌర సరఫరాల మంత్రులు నాతో మాట్లాడి దీనిపై విచారణ చేయిస్తామని చెప్పారు. – పిల్లి సుభాష్‌ చంద్రబోస్, ఎంపీనిజానికి రైతు భరోసా కేంద్రాలు ఎంత అండగా నిలుస్తున్నాయో ఏ ఊళ్లో ఏ రైతును కదిలించినా తెలుస్తుంది. అలాంటి కొందరు రైతుల అభిప్రాయాలివీ..పంట నష్టం కూడా అందింది...మాకు రామచంద్రపురం మండలం చోడవరంలో మూడెకరాల వరిపొలం ఉంది. ప్రతి సీజన్లో పంట నమోదు చేస్తున్నా. మూడేళ్లుగా రైతు భరోసా రూపంలో పెట్టుబడి సాయం అందుతోంది. తొలకరిలో అధిక వర్షాల వల్ల పంట నష్టపోయినా... ఆర్బీకేలోని గ్రామ వ్యవసాయ సహాయకుడు దాని వివరాలు నమోదు చేశారు. దీంతో ప్రభుత్వం నుంచి పరిహారం కూడా అందింది.నేను పండించిన ధాన్యాన్ని మూడేళ్లుగా ఆర్బీకే ద్వారానే విక్రయిస్తున్నా. ఖరీఫ్‌లో క్వింటాలుకు రూ.1940 ధాన్యం సొమ్ము గతంలో 21 రోజులకు అందింది. హమాలీ ఖర్చులు క్వింటాలుకు రూ.25 చొప్పున చోడవరం సొసైటీ ద్వారా చెక్కు రూపంలో అందజేశారు. ఎరువుల కోసం తిప్పలు లేకుండా ఆర్బీకే నుంచే యూరియా, డీఏపీ అందాయి. – గుణ్ణం రామకృష్ణ, రైతు, చోడవరం, కోనసీమ జిల్లాతూకం.. లెక్కల్లో తేడాలు లేవు..ఐదెకరాలు కౌలుకు తీసుకుని రబీ పంట సాగు చేశా. రెండెకరాల్లో కోత కోశా. 77 బస్తాల ధాన్యం వచ్చింది. ఆర్బీకేలో గురువారం విక్రయించాను. బస్తాకు రూ.1,455 చొప్పున 77 బస్తాలకు రూ.1,12,035 నగదు ఇస్తామని రసీదు ఇచ్చారు.హమాలీ చార్జీలు క్వింటాలుకు రూ.25 ఇస్తున్నారు. తూకం, లెక్కల్లో తేడాల్లేవు. అదే ధాన్యాన్ని గ్రామంలోని దళారి వద్దకు తీసుకెళితే బస్తాకు రూ.1,300 ఇస్తానన్నాడు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే న్యాయం జరుగుతోంది. మిగిలిన మూడెకరాలూ కోత కోశాక ఆర్బీకేలోనేవిక్రయిస్తా. – మొర్త అప్పారావు, కేశనకుర్రు గ్రామం, పెదలంక Fri, May 20 2022 4:26 AM
  • దుష్ట చతుష్టయంతో జాగ్రత్త సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్రంలో ప్రజలకు మంచి జరుగుతోంది కాబట్టి కొందరికి కడుపుమంట పెరుగుతోందని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాయలున్న చెట్లకే రాళ్లు పడతాయని.. ఇంతగా చేస్తున్న మంచిని జీర్ణించుకోలేక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5తో పాటు చంద్రబాబు కలసి దుష్ట చతుష్టయంలా, దొంగలముఠాలా మారి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.పేదింటి పిల్లలు గొప్ప డాక్టర్లు, ఇంజనీర్లుగా ఎదిగిఆ కుటుంబంతో పాటు సమాజం స్థితిగతులుమారేలా ఇంగ్లిష్‌ మీడియం చదువులు తీసుకొస్తే అడ్డుపడ్డారని విమర్శించారు. చివరకు నిరుపేదఅక్కచెల్లెమ్మల పేరుతో ఇళ్ల పట్టాలిచ్చిలక్షల కుటుంబాలకు గూడు కల్పిస్తుంటే దానికీ ఆటంకాలు సృష్టించారని ధ్వజమెత్తారు. అమ్మ ఒడి లాంటి పథకాలకూ ఆటంకాలు సృష్టిస్తూ గోబెల్స్‌ ప్రచారంతో వంచించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. నారాయణ, చైతన్య స్కూళ్ల నుంచే ప్రశ్న పత్రాల లీకేజీ జరిగిందని స్పష్టం చేశారు. గురువారం తిరుపతిలో జగనన్న విద్యా దీవెన పథకం నాలుగో త్రైమాసికం ఫీజుల కింద రూ.709.20 కోట్లను నేరుగా 9.73 లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి సీఎం జమ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో 10,85,225 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. తిరుపతిలో రూ.320 కోట్లతో నిర్మిస్తున్న చిన్నపిల్లల మల్టీ సూపర్‌ స్పెషాల్టీ ఆసుపత్రి భవన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. రూ.190 కోట్లతో టాటా ట్రస్టు నిర్మించిన క్యాన్సర్‌ కేర్‌ అండ్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ ఆసుపత్రిని ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఎస్వీ యూనివర్సిటీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్‌ మాట్లాడారు. ఆ వివరాలివీ...దోషులపై దాగుడు మూతలుప్రజలకు మేలు చేస్తుంటే చూడలేక ఏదో జరిగిపోతోందంటూ ఎల్లో మీడియా నానాయాగీ చేస్తోంది. మనం ఏం చేస్తున్నామో అమ్మలకు, అక్కచెల్లెమ్మల కళ్లకు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. చంద్రబాబుతో పాటు ఆయన్ను మూడు దశాబ్దాలుగా మోస్తూ ఎదిగిన దొంగల ముఠాకి విద్యావ్యవస్థలో జరుగుతున్న మార్పులతో ఎక్కడలేని బీపీ పెరుగుతోంది. తప్పుడు రాతలతో పరదా కట్టాలని చూస్తున్నారు. గుంటూరు, విజయవాడ, విశాఖలో ఇటీవల చోటు చేసుకున్న హత్యాచారాల ఘటనల్లో దోషులు ఎవరనేది ఈనాడు రాయదు. ఆంధ్రజ్యోతి చెప్పదు. టీవీ–5 చూపించదు. కారణం ఏమిటంటే.. ఆ కేసుల్లో దోషులంతా టీడీపీ నాయకులే కాబట్టి. ఇటువంటి దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. వీళ్లే చేస్తారు.. మళ్లీ వీళ్లే వక్రీకరిస్తారు.. దుర్భుద్ధితో పచ్చి ఆరోపణలు చేస్తారు.నారాయణ చైతన్య నుంచే లీకేజీలు..మనం చేస్తున్న మంచిని ప్రజలు మరిచిపోవాలనే ఎల్లోమీడియా తప్పుడు రాతలు రాస్తోంది. ఈరోజు విద్యాదీవెన ప్రారంభిస్తున్నామని తెలిసి దుష్ప్రచారం కొత్త మలుపు తిప్పారు. విద్యాదీవెన ప్రజల్లోకి వెళ్లకుండా పక్కదారి పట్టించేందుకు ప్రశ్నాపత్రాలను వాట్సాప్‌లో లీక్‌ చేయించి ప్రభుత్వంపై బురద చల్లే కార్యక్రమాన్ని చేపట్టారు. రెండు నారాయణ, మూడు చైతన్య స్కూళ్ల నుంచే ఈ లీకేజీలు జరిగాయి. ఇందుకు కారకుడైన ఆ నారాయణ ఎవరండి ? చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి. వాళ్ల విద్యాసంస్థల నుంచే లీక్‌ చేయించి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ దొంగే.. దొంగ దొంగ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.ఆ ఐదేళ్ల పాపాల పాలనలో..చంద్రబాబు ఐదేళ్ల పాపాల పాలనలో గుడులను ధ్వంసం చేస్తే మనం ఆలయాలను కట్టించాం. వాళ్లు విగ్రహాలను విరిచేస్తే మనం పునఃప్రతిష్టించాం. వారు రథాలను తగులబెడితే మనం రథాలను మళ్లీ నిర్మించాం. వాళ్లు రైతులను కుంగదీస్తే మనం రైతులను తిరిగి నిలబెడుతున్నాం. వాళ్లు మన పల్లెల్ని దెబ్బతీస్తే మనం ప్రతి పల్లెల్లో ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకెళ్లాం. అవినీతికి తావు లేకుండా గడప వద్దకే సుపరిపాలన తెచ్చి దేశానికే మార్గ నిర్దేశం చేశాం. అర్హులందరికీ సంతృప్త స్థాయిలో పథకాలను అందిస్తున్నాం. వాళ్లు మన బడిని, ఆసుపత్రులను శిథిలావస్థకు చేరిస్తే మనం నాడు–నేడుతో వాటికి జవసత్వాలు చేకూర్చాం. వారు పేద పిల్లలు ఉన్నత చదువులు చదువు కూడదన్న దుర్బుద్ధి ప్రదర్శిస్తే మనం విద్యావిధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం.ఘన స్వాగతం..తిరుపతి పర్యటన సందర్భంగా సభా ప్రాంగణానికి ముఖ్యమంత్రి చేరుకోగానే విద్యార్థులంతా జగన్‌ మామకు జై.. అంటూ ఘన స్వాగతం పలికారు. తొలుత తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, మంత్రులు మేరుగు నాగార్జున, ఆర్కే రోజా ప్రసంగించారు. ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఉషశ్రీ చరణ్, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎంపీ డాక్టర్‌ గురుమూర్తి, మేయర్‌ శిరీషా, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.వెంకన్నను ప్రార్థిస్తున్నా...వారే స్క్రిప్టు రాస్తారు.. వారే యాక్షన్‌ చేస్తారు.. మళ్లీ ఘోరం జరిగిందని గోల చేసేది కూడా వారే. ఇవన్నీ గమనించమని ప్రజలను కోరుతున్నా.. ఇలాంటిప్పుడు మనం కోరగలిగింది ఒక్కటే.. దేవుడా రక్షించు మా రాష్ట్రాన్ని.. ఈ ఎల్లో మీడియా నుంచి. ఈ ఎల్లో పార్టీ నుంచి. రెండు నాల్కలు చాచి బుసలు కొట్టే నిర్హేతుక విష సర్పాల నుంచి.. ధూర్తుల నుంచి.. దుష్ట చతుష్టయం నుంచి రక్షించు దేవా.. అని తిరుపతిలో శ్రీవేంకటేశ్వరస్వామిని ప్రార్థిస్తున్నా.ఇంగ్లీషు మీడియంపై అడ్డుపుల్లలునాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులకు మన ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఇంగ్లీషు మీడియాన్ని తీసుకురావాలన్న ఆలోచన చంద్రబాబు ఏనాడైనా చేశారా? మేం తీసుకొస్తే అడుగడుగునా అడ్డుకున్నారు. లేనిపోని నిందలు, అభాండాలు వేసి పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియాన్ని దూరం చేయాలన్న కుట్రలు మీరంతా చూశారు. పిల్లలను చదువుల బాట పట్టించాలన్న లక్ష్యంతో అమ్మ ఒడికి శ్రీకారం చుట్టాం. పిల్లలను చదివించే ప్రతి తల్లికి తోడుగా నిలుస్తూ రూ.15 వేల చొప్పున ఇస్తున్నాం. పాఠశాలల పునఃప్రారంభం రోజే పుస్తకాలు, యూనిఫామ్‌ అందిస్తున్నాం.ఇళ్లను అడ్డుకుంటూ తప్పుడు రాతలుజగన్‌కు ఎక్కడ మంచిపేరు వస్తుందోనన్న కడుపు మంటతో వారి కుళ్లు, కుతంత్రాలు ఏ స్థాయికి చేరాయో మీరే గమనించండి. 1.3 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలిస్తే అప్పుడు పేపర్‌ లీకేజీ అంటూ యాగీ చేశారు. దేశ చరిత్రలో ఎవరికి సాధ్యం కాని విధంగా 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలిస్తుంటే ఏ విధంగా అడ్డుకున్నారో మీరంతా చూశారు. 18.41 లక్షల ఇళ్ల నిర్మాణాలు జరుగుతుంటే రెచ్చగొట్టేలా తప్పుడు రాతలు రాస్తున్నారు. చంద్రబాబు ఐదేళ్లలో టిడ్కో ఇళ్లను నిర్మించలేక చేతులెత్తేస్తే, మనం అధికారంలోకి వచ్చాక నిర్మించి పేదలకు ఇస్తుంటే ఎల్లో మీడియా ఓర్వలేక బురద చల్లుతోంది. మనం చేస్తున్న మంచి ప్రజల్లోకి వెళ్లకుండా గుంట నక్కల కన్నా హీనంగా అడ్డుకుంటున్నారు. Fri, May 6 2022 3:12 AM
  • గురువుకా... రాజ గురువుకా పరీక్ష? తప్పు.. తప్పు కాకుండా పోయేదెప్పుడు?నేరం చేసినవారిపై కేసులు పెట్టడమే నేరమయ్యేదెప్పుడు? అక్రమాలను అడ్డుకోవటమే పాపమయ్యేదెప్పుడు? ఈ ప్రశ్నలకు ‘ఈనాడు’ అధిపతి రామోజీరావు మాత్రమే ఠక్కున జవాబివ్వగలరు.అది... ‘చంద్రబాబు అధికారంలో లేనప్పుడు’అని! ‘గురువులకే పరీక్ష’ అంటూ బుధవారం‘ఈనాడు’ పతాక శీర్షికతో అచ్చేసినకథనం ఇలాంటిదే మరి. దొంగతనం చేసిన వ్యక్తి తానెలాంటిపరిస్థితుల్లో ఆ దొంగతనం చేశాడో చెబితేకరిగిపోవటానికి ఇదేమైనా సినిమానారామోజీ? కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే...కష్టపడి చదువుకున్న విద్యార్థులునష్టపోతారని తెలియదా? విద్యార్థులసామర్థ్యాన్ని పరీక్షించడానికేగా పరీక్షలు?లక్షన్నర మంది ఉపాధ్యాయుల్లోఓ 10 మంది చేసిన తప్పిదం వల్ల మొత్తంవ్యవస్థకే చెడ్డపేరు రావటం లేదా?తప్పు జరిగినపుడు దాన్ని తప్పు అనిచెప్పకపోతే ఎలా? వారు అలా చేయటంకరెక్టేనన్నట్టు ఆ రాతలేంటి? అధికారంలోఉన్నది చంద్రబాబు కాకుంటే ఎంతతప్పయినా ఒప్పయిపోతుందా?‘ఈనాడు’ దారుణమైన కథనాల్లోనిజమెంత? ఏది నిజం?ఐదేళ్ల కిందట... 2017లో విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు. నారాయణ విద్యాసంస్థల అధిపతికి స్వయానా వియ్యంకుడు. నారాయణ కూడా... మరో మంత్రి. అప్పట్లో టెన్త్‌ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ ఓ రేంజిలో జరిగింది. ‘నారాయణ’ సిబ్బంది కొందరు పేపర్లు లీక్‌ చేయటమే కాక... రోజూ తమ బ్రాంచీలకు జవాబులు పంపి మాస్‌ కాపీయింగ్‌కు తెగబడ్డారు. దీన్ని నాటి ప్రతిపక్ష నేత... ప్రస్తుత సీఎం వై.ఎస్‌.జగన్‌ ఆధారాలతో సహా అసెంబ్లీలో పెట్టారు. గంటా, నారాయణ, చంద్రబాబు పొంతన లేని సమాధానాలు చెప్పారు. వీళ్లందరి భాష్యమూ ఒక్కటే!! పేపర్లు బయటికొచ్చాయి కానీ.. అది లీక్‌ కాదు!. కాపీయింగ్‌ జరిగింది కానీ.. మాస్‌ కాపీయింగ్‌ కాదు. జస్ట్‌ మాల్‌ప్రాక్టీస్‌. బస్‌! ఎవ్వరిపైనా కేసుల్లేవు. అంతా గప్‌చుప్‌!!. అందుకే... ‘ఈనాడు’ దృష్టిలో ఇది స్వర్ణయుగం. ఇప్పుడలా కాదు. రాష్ట్ర వ్యాప్తంగా మాస్‌కాపీయింగ్, మాల్‌ప్రాక్టీస్‌కు సంబంధించి ఏకంగా 60 మందిపై కేసులు పెట్టి అరెస్టు చేశారు. వీరిలో నారాయణ స్కూళ్లకు చెందిన సూత్రధారులూ ఉన్నారు. 38 మంది ప్రభుత్వ అధ్యాపకులు, సిబ్బంది కూడా ఉన్నారు. 2017లో 10వ తరగతి ప్రశ్నాపత్నాల లీజేజీలు, నారాయణ సిబ్బంది ప్రమేయాన్ని బయటపెట్టిన రుజువులివే.. ఆలోచనకు సంబంధించిన అవయవాలన్నీ సక్రమంగా పనిచేసే వారెవరైనా ఇలాంటి చర్యల్ని అభినందిస్తారు. రామోజీ రూటే సెపరేటు!! మంచి ఫలితాల కోసం ఉపాధ్యాయుల్ని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది కనకే వారిలా చేస్తున్నారని, అలాంటి అధ్యాపకులపై కేసులు పెట్టడమేంటని ‘ఈనాడు’ ఆక్రందనలు మొదలెట్టింది. రామోజీరావు గారూ!! ఇది ఏ స్థాయి జర్నలిజం?ఫలితాలు బాగుండాలనటం ఒత్తిడా?ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మంచి మార్కులతో పాస్‌ అయ్యేలా చక్కని ప్రమాణాలతో విద్యా బోధన సాగాలని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. దాదాపు లక్షన్నర మంది టీచర్లలో ఓ పిడికెడు మందికి మాత్రం అది ఒత్తిడి చేయటంలా కనిపించింది. వారు మాస్‌ కాపీయింగ్‌ను ప్రోత్సహించటంతో... వారికి జై కొడుతూ ‘ఈనాడు’ వారి వెనకన చేరిపోయింది. నిజానికి రామోజీ ఉద్దేశం వేరు. నారాయణ లాంటి స్కూళ్లు అక్రమాలకు పాల్పడకపోతే టెన్త్‌లో మంచి ఫలితాలు రావు. దీంతో వాటి పేరు దెబ్బతిని... అడ్మిషన్లు తగ్గి మొదటికే మోసం వస్తుంది. ఇది చంద్రబాబుకు ఇబ్బందికరమైన పరిస్థితి కనక... వాళ్లను వెనకేసుకు రావటం మొదలెట్టారు. బాబు మిత్రులైన కార్పొరేట్‌ స్కూళ్లకోసం మరీ ఇంతలా దిగజారాలా? దానికి ప్రభుత్వ స్కూళ్ల ఉపాధ్యాయుల్ని అడ్డం పెట్టుకోవాలా? విద్యావిప్లవం కనిపించటం లేదా?ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక... ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్‌ను తలదన్నేలా తీర్చిదిద్దటం మొదలెట్టారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. నాడు–నేడు అంటూ స్కూళ్ల రూపు రేఖలు మార్చారు. జగనన్న అమ్మ ఒడి, విద్యా కానుక, గోరుముద్ద వంటి పథకాలతో విద్యను అందరికీ చేరువ చేశారు. ఫలితం... కొన్ని ప్రైవేటు స్కూళ్లు మూతపడ్డాయి. 6 లక్షలమంది ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు సర్కారీ స్కూళ్లకు వచ్చారు. పోటీ ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంగ్లీషు మీడియం తెచ్చారు. విద్యార్థులకు మెరుగ్గా బోధించే బాధ్యత టీచర్లదే కనక... దానికి కొలమానంగా ఫలితాలుండాలని నిర్దేశించారు. ఇది తప్పా రామోజీ? అరకొర వసతులు, చాలీచాలనీ జీతాలిచ్చే ప్రైవేటు స్కూళ్లే తమ విద్యార్థులు సరైన మార్కులు తెచ్చుకోకుంటే టీచర్లను బాధ్యులను చేస్తాయి. మరి వేల కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించి... అన్నింటా మెరుగైన ప్రయోజనాలు కల్పిస్తున్న ప్రభుత్వం... పేద విద్యార్థులు మంచి మార్కులు సాధించాలని ఆశించడం నేరమా? అది ప్రభుత్వ బాధ్యత కాదా? ‘ఈనాడు’కెందుకు ఇంత ఉలుకు? ఇది ఉపాధ్యాయుల్ని ఒత్తిడి చేయటమెలా అవుతుంది? ఎందుకీ వక్రభాష్యాలు? మంచి మార్కులు రావాలంటే మాస్‌ కాపీయింగ్, మాల్‌ ప్రాక్టీస్‌ తప్పనిసరి అన్నట్టుగా ఏంటీ రాతలు? నాడు బాబు హయాంలో నిజంగా జరిగినా నోరుమెదపని ఈనాడు... ఇపుడు ఉన్నవీ లేనివీ పోగేసి ‘గురు’వింద రాతలు.. నారాయణ... నారాయణఈ సారి టెన్త్‌ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడ్డదెవరో తెలియదా రామోజీ? తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో తొలిరోజే నారాయణ విద్యా సంస్థల ప్రతినిధులు అక్రమాలకు టెంకాయ కొట్టేశారు. తిరుపతి నారాయణ వైస్‌ ప్రిన్సిపాల్‌ ఎన్‌.గిరిధర్‌ రెడ్డి చిత్తూరులో ఇన్విజిలేటర్‌గా పనిచేస్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని ప్రలోభపెట్టి వాట్సాప్‌ ద్వారా పేపరు తెప్పించుకున్నాడు. దాన్ని నారాయణ, మరికొన్ని ప్రైవేటు విద్యా సంస్థల అధికారులు, సిబ్బందికి ఫార్వర్డ్‌ చేశాడు. కానీ ఈ కుట్రను పోలీసులు రట్టు చేయటంతో కథ అడ్డం తిగింది. గిరిధర్‌తో పాటు చైతన్య స్కూల్‌ ప్రిన్సిపల్‌ ఆరీఫ్, డీన్‌ కె.మోహన్, తిరుపతి ఎన్‌ఆర్‌ఐ అకాడెమీ ఉపాధ్యాయుడు కె.సుధాకర్, శ్రీకృష్ణారెడ్డి చైతన్య స్కూల్‌ ప్రిన్సిపాల్‌ పి.సురేష్, ప్రభుత్వ ఉపాధ్యాయులు పవన్‌కుమార్, బి. సోములను అరెస్టు చేశారు. ఇదే... ఈనాడు ఆగ్రహానికి అసలు కారణం మరి!!.టీడీపీ... మరో అడుగు ముందుకుప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ఏ స్థాయికైనా దిగజారాలన్నది టీడీపీ ‘వ్యూహం’. గతంలో రాష్ట్రం డ్రగ్స్‌ మయమైపోయిందని... గంజాయి పెరిగిపోయిందని చేసిన ప్రచారాలు ఈ కోవలోనివే. ఇటీవల తెలుగుదేశం తమ్ముళ్లు అత్యాచారాలకు తెగబడితే... చినబాబు లోకేశ్‌ వాటిని ప్రభుత్వానికి అంటగడుతూ ఎగిరెగిరి పడటమూ ఇలాంటిదే. ఇక టెన్త్‌ విషయంలో ఈ దుష్టచతుష్టయం మరో అడుగు ముందుకేసింది. శ్రీకాకుళం జిల్లా రొట్టవలస, కొత్తపేట జెడ్పీ హైస్కూళ్లలో హిందీ ప్రశ్నాపతాన్ని టీడీపీ నేతలే లీక్‌ చేసి వాట్సాప్‌లో వైరల్‌ చేశారు. పోలీసులు నిగ్గు తేల్చి ఏడుగురు టీడీపీ కార్యకర్తల్ని అరెస్టు చేశారు కూడా. లీక్‌ వెనుక ఏబీఎన్‌–ఆంధ్రజ్యోతి సిబ్బంది పాత్ర కూడా ఉందంటే కుట్ర లోతును అర్థం చేసుకోవచ్చు. లీకేజీ వార్తల్ని ఆ చానలే పదే పదే ప్రసారం చేసింది. కళ్లముందున్న వాస్తవాలక్కూడా ఇన్ని రంగులేస్తున్న ఎల్లో మీడియా ఇంకెన్నాళ్లు జనాన్ని నమ్మించగలుగుతుంది? మీ అబద్ధాల్ని జనం ద్వేషిస్తున్నారని తెలియదా? వింటున్నారా రామోజీ!! Thu, May 5 2022 4:19 AM
  • టీడీపీ హయాంలో రూ.31.14 కోట్ల మందులు వృథా! సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలుగా చూపి పచ్చ పత్రికలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే గుంటూరులోని సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌ (సీడీఎస్‌)లో రూ.కోట్ల విలువజేసే ఉచిత మందులకు చెద పట్టిందని ఈనాడు ఓ కథనాన్ని బుధవారం ప్రచురించింది. 2019, 2020 సంవత్సరాల్లో కొనుగోలు చేసిన ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, సిరంజులు, సెలైన్‌ బాటిళ్లు, సర్జికల్స్‌ వృథాగా మారాయంటూ గగ్గోలు పెట్టారు. అయితే ఆ మందులన్నీ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2019కు ముందు వివిధ రకాల పథకాలు, పుష్కరాల కోసం కొనుగోలు చేసిన స్టాక్స్‌గా ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారులు స్పష్టం చేశారు. అప్పట్లో సకాలంలో వినియోగించకపోవడం వలన సీడీఎస్‌లో వినియోగంలో ఉన్న మందులకు దూరంగా ఉంచామని పేర్కొన్నారు.2016 నుంచి 2019 మధ్య అప్పటి అధికారులు, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రూ.31,14,06,713.04 విలువైన మందులు వృథాగా మారాయని తెలిపారు. కరోనా చికిత్సకు ఉపయోగించే కొన్ని రకాల మందులు కేంద్ర ప్రభుత్వం, ప్రైవేట్‌ ఏజెన్సీల నుంచి సప్లై చేయగా ఆ మందులు కరోనా ఆస్పత్రుల్లో వినియోగించకపోవడంతో ఎక్స్‌పెయిర్‌ అయ్యాయన్నారు. అన్ని జిల్లాల్లో కమిటీలు వేసి వాటి రిపోర్ట్‌కు అనుగుణంగా గత 10–15 సంవత్సరాల నుంచి నిల్వ ఉంచిన కాలంచెల్లిన మందులు, సర్జికల్స్‌ను కాలుష్య నియంత్రణ బోర్డు గుర్తించిన ఏజెన్సీల ద్వారా డిస్పోజ్‌ చేస్తున్నామన్నారు. ఫస్ట్‌ ఎక్స్‌పెయిర్‌ ఫస్ట్‌ అవుట్‌ నిబంధన ప్రకారం మాత్రమే అన్ని జిల్లాల్లోని మందులు ఆస్పత్రులకు సరఫరా చేస్తున్నామన్నారు. ఆస్పత్రుల్లో ప్రస్తుత మందుల వినియోగానికి మాత్రమే కొనుగోలు చేస్తున్నామన్నారు. ప్రజలు అపోహలను నమ్మొద్దని ఏపీఎంస్‌ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి కోరారు. Thu, May 5 2022 3:40 AM
  • ‘ఈనాడు’ కుట్ర ఇంతింత కాదయా!! ప్రభుత్వంపై తెలుగుదేశం ఓ కరపత్రంవేస్తుంది. ప్రతిపక్షం కాబట్టి అది ఎన్నిఅబద్ధాలైనా ఆడొచ్చు. కానీ అదే కరపత్రాన్ని‘ఈనాడు’ ఎంచక్కా అచ్చేస్తుంది. అదే ‘ఈనాడు’ కాపీని పట్టుకుని... తెలుగుదేశం విమర్శలకు దిగుతుంది. ఏమనుకోవాలి దీన్ని? ఏం జర్నలిజమిది? దొంగలు–దొంగలు చేతులు కలపటమంటేఇది కాదా? రామోజీ తన పత్రికనునడుపుతున్నది ఎవరి కోసం? దేశం కోసమా...! తెలుగుదేశం కోసమా?దేశవ్యాప్తంగా పెరుగుతున్న ధరలనుకూడా రాష్ట్రానికి అంటగట్టి...మూడేళ్ల కిందటితో పోలుస్తూ పొలికేకలుపెడుతున్న రామోజీకి... తన బాబుహయాంలో కూడా ధరలు ఇంతే తీవ్రంగాఉన్నాయని తెలియదా? అప్పట్లో తానేతన పత్రికలో వీటిని అచ్చేసిన విషయంమరిచారా? మరి ఎందుకీ దిగజారుడురాతలు? ‘ఇంటి ఖర్చు ఇంతింత కాదయా’అంటూ రాసిన రాతల్లో ఏది నిజం?ప్రతిపక్షంగా గొంతెత్తడానికి ఏ అంశాలూ లేకపోవటంతో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ఓ విచిత్రమైన ప్రచారానికి పూనుకుంది. నిత్యావసరాలపై ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ‘బాదుడే – బాదుడు’ అనే కార్యక్రమాన్ని ఎత్తుకుంది. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేని పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌ వంటివన్నీ ప్రస్తావిస్తూ... వాటిపై పెరిగిన ధరల మొత్తాన్ని ఏకంగా ముఖ్యమంత్రే దోచేసుకుంటున్నారంటూ విషప్రచారానికి పూనుకుంది. ఈ ప్రచారాన్ని మరింతగా జనంలోకి తీసుకెళ్లేలా రామోజీరావు ‘ఈనాడు’ ద్వారా తనవంతు సాయం చేయటం మొదలెట్టారు. అందులో భాగంగానే... ధరలెందుకు పెరుగుతున్నాయి? కారణాలేంటి? వాటిని నియంత్రించగలిగేదెవరు? అనే అంశాలు వీసమాత్రమైనా లేకుండా... కేవలం ధరలు పెరగటం, వాటివల్ల జనంపై పెరుగుతున్న భారాన్ని నోటిలెక్కలు వేయటం... మూడేళ్ల కిందట ఈ పరిస్థితి లేదని, అప్పట్లో చంద్రబాబు పాలన గుప్తుల కాలం నాటి స్వర్ణయుగంలా సాగిందంటూ రాతలు రాసిపారేస్తున్నారు.రామోజీ! ఇందులో రాష్ట్రం బాధ్యత ఎంత?రెండేళ్ల పాటు కోవిడ్‌ మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసింది. ఇప్పటికీ దాని ఛాయలు పూర్తిగా తొలగిపోలేదు. ఈ సమయంలో పెట్రో ఉత్పత్తుల వినియోగం దారుణంగా పడిపోవటం... దాంతో కొన్నిచోట్ల ఉత్పత్తి నిలిపేయటం... మళ్లీ డిమాండ్‌ పుంజుకున్నా ఉత్పత్తి మునుపటిలా పెరగకపోవటం... ఇదే సమయంలో రష్యా– ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం తలెత్తడం... ఇవన్నీ కలిసి పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ ధరలను విపరీతంగా పెంచాయి. మరి ఇందులో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఎంత? రాష్ట్రం ప్రత్యేకంగా పన్నులేమైనా పెంచిందా? దీనికి రాష్ట్రాన్ని తప్పుబట్టడం ఎంతవరకు సమంజసం?పెట్రో ఉత్పత్తులే కాదు! వంటనూనెల ధరలూ ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ఆకాశాన్నంటడం మొదలెట్టాయి. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) కూడా తీవ్రంగా ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేని అంశం. ఇక పెట్రోల్, డీజిల్‌ విషయానికొస్తే వీటిపై రాష్ట్రం పెంచగలిగేది ఒక్క వ్యాట్‌ను మాత్రమే. కానీ... 2019 నుంచీ ఏపీ ప్రభుత్వం ఒక్క శాతం కూడా వ్యాట్‌ను పెంచలేదు. చంద్రబాబు హయాంలో ఉన్నప్పటి ధరలే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇవే ధరలున్నాయి. పెట్రో ఉత్పత్తుల ధరలు ప్రధానంగా చమురు కంపెనీల నిర్ణయం, కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆధారపడి కొనసాగుతున్నాయి. ఇవన్నీ పక్కనబెట్టి... చంద్రబాబు ‘బాదుడే – బాదుడు’ కోసం రామోజీ ఈ స్థాయిలో దిగజారి తన పాఠకులను అబద్ధాలతో బాదారంటే ఏమనుకోవాలి? వంటనూనెల ధరలు మీరు పెంచలేదా?రామోజీ రాతల్లో డొల్లతనం ఎంతుందో ఒక్క వంటనూనెల ధరలను బట్టే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌ నుంచి మన దేశానికి వంటనూనెల దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో డిమాండ్‌కు తగ్గ సప్లయ్‌ లేక ధరలు బాగా పెరిగాయి. ప్రియా బ్రాండ్‌తో వంటనూనెలు, పచ్చళ్లు విక్రయించే రామోజీ... తాను సైతం వాటి ధరలను బాగానే పెంచారు. కొన్ని ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లలో ప్రియా వంటనూనె తక్కువ ధరనే చూపిస్తున్నా... ఒక్క లీటర్‌ కూడా ఆ «ధరకు దొరికే పరిస్థితి లేదు. నిజానికి యుద్ధ ప్రభావంతో దిగుమతులు తగ్గి... అంతర్జాతీయంగా వంటనూనెల ధరలు బాగా పెరిగాయి. ఇది వాస్తవం. కానీ దీన్ని దాచిపెట్టి... ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే పెరిగినట్లుగా... అది కూడా మూడేళ్ల కిందట వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచే పెరిగినట్లుగా రాయటంలోనే ‘ఈనాడు’ దివాలాకోరుతనమంతా కనిపిస్తుంది.పెట్రోల్‌ ధరలపై వాస్తవాలను వివరిస్తూ ఇటీవల రాష్ట్రప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో ఓ భాగంవిద్యుత్‌ చార్జీలపై దుష్ప్రచారం కాదా?విద్యుత్‌ చార్జీలు చంద్రబాబు నాయుడి హయాంలో భారీగా పెరిగాయి. మూడేళ్ల తరవాత ఇటీవల మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం స్వల్పంగా విద్యుత్‌ చార్జీలను పెంచింది. కానీ ఇప్పుడే విద్యుత్‌ చార్జీలు భారీగా పెరిగాయని, దీనివల్లే మొత్తం ఇంటి బడ్జెట్‌ తల్లకిందులైపోతోందని రామోజీ గుండెలు బాదేసుకున్నారు. చంద్రబాబు హయాంలో నెలవారీ విద్యుత్‌ వినియోగం 76 యూనిట్లు నుంచి 100 యూనిట్లు వినియోగించే వారికి కూడా విద్యుత్‌ బిల్లులు 28.40 శాతం నుంచి 41.04 శాతం వరకు పెరిగాయి. అయినా అçప్పట్లో దానిపై ఒక్క వార్తా రాయకపోవటమే రామోజీ అసలు సిసలు పాత్రికేయ పాతివ్రత్యం.అప్పట్లో సాధారణ పరిస్థితుల్లో కూడా...నిజానికి పప్పుల విషయానికొస్తే కోవిడ్‌ సంక్షోభం, రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం లేని సాధారణ రోజుల్లోనూ... చంద్రబాబు పాలన కాలంలో పప్పుల ధరలు భారీగా పెరిగాయి. అప్పట్లో అదే విషయమై సాక్షాత్తూ ‘ఈనాడు’లోనే పలు కథనాలు రాశారు. కాకపోతే వాటిని బాబు పరిపాలన లేని తెలంగాణలో మాత్రమే అచ్చేశారు... అది వేరే సంగతి. 30–10–2015న ‘ఈనాడు’ ఓ కథనాన్ని రాస్తూ.. అప్పటి ధరలను అంతకు ముందటేడాదితో పోల్చింది. ఆ ఏడాది కాలంలోనే కందిపప్పు రూ.70 నుంచి 200కు... మినపప్పు రూ.80 నుంచి రూ.190కి.. పెసరపప్పు రూ.70 నుంచి 140కి పెరిగి కూర్చున్నాయి. అంటే... బాబు వచ్చిన ఏడాదిలోనే ఒక్కొక్కటీ 100 నుంచి 180 శాతం వరకూ పెరిగాయి. మరి దీన్నేమనుకోవాలి? అప్పట్లో ఎందుకు బాబు వచ్చాక ఈ స్థాయిలో పెరిగిపోయాయని రాయలేదు?ఇప్పుడు కోవిడ్‌ సంక్షోభం, ఉక్రెయిన్‌ యుద్ధం వంటి పరిస్థితుల్లో కూడా ఇదే ‘ఈనాడు’ రాతల ప్రకారమే మినపప్పు ధర కిలో 112 రూపాయలుంది. మరి అప్పట్లో ఇంకా ఎక్కువున్నట్టుగా? ఆ విషయాన్నెందుకు ప్రస్తావించరు?ద్రవ్యోల్బణం పెరిగిందిలా...సామాన్యుల మాటల్లో చెప్పాలంటే ద్రవ్యోల్బణమంటే ధరల పెరుగుదలే. ఏడాదిలో ఏ స్థాయిలో పెరిగాయన్నది ఈ సూచీ తెలియజేస్తుంది. దీన్నిబట్టే అంతర్జాతీయంగా, దేశీయంగా ధరలు ఏ ధోరణిలో ఉన్నాయో అర్థమవుతుంది. అలాంటి ద్రవ్యోల్బణం 2015 నుంచీ ఇప్పటి దాకా ఎలా మారుతూ వచ్చిందంటే... Wed, May 4 2022 4:07 AM
  • నిబంధనలమేరకే ‘రుషికొండ’ నిర్మాణాలు సాక్షి, అమరావతి: విశాఖపట్నంలోని రుషికొండ పర్యాటక ప్రాజెక్టును ‘కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ (సీఆర్‌జెడ్‌) నిబంధనలకు అనుగుణంగానే నిర్మిస్తున్నామని పర్యాటకశాఖ స్పష్టం చేసింది. కేంద్ర అటవీ, పర్యావరణశాఖ నుంచి పూర్తి అనుమతులు పొంది ఆమేరకే నిర్మాణ పనులు చేపడుతున్నామని పేర్కొంది. సీఆర్‌జెడ్‌ నిబంధనలకు విరుద్ధంగా రుషికొండ పర్యాటక ప్రాజెక్టు నిర్మిస్తున్నారని ‘ఈనాడు’ పత్రిక ప్రచురించిన కథనం పూర్తిగా వాస్తవ విరుద్ధంగా ఉందని పర్యాటకశాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. రూ.240 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ముందుగానే అన్ని అనుమతులు తీసుకుని నిర్మాణ పనులు చేపట్టిందని పేర్కొంది. 9.88 ఎకరాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టులో 5.18 ఎకరాల్లో నిర్మాణాలు చేపడుతుండగా 4.70 ఎకరాలు సుందరీకరణకు కేటాయించినట్టు తెలిపింది.ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం కోస్టల్‌ జోన్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ అనుమతించిన 139 చెట్లనే తొలగించామని, మిగిలినవి పొదలేనని పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా వందలాది చెట్లను తొలగించినట్టు ‘ఈనాడు’ పత్రిక తన కథనంలో పేర్కొనడం అవాస్తవమని తెలిపింది. తొలగించిన చెట్లకు బదులుగా అంతకు రెండింతలకుపైగా మొక్కలు నాటేందుకు ఇప్పటికే నిర్ణయించామని, భవన నిర్మాణాలు పూర్తికాగానే మొక్కలు నాటతామని తెలిపింది. నిర్మాణ వ్యర్థాలు, కంకరను తీరప్రాంతంలో 10 కిలోమీటర్ల మేర పారబోస్తున్నట్టు చేసిన ఆరోపణలు కూడా సత్యదూరమని స్పష్టం చేసింది.విశాఖపట్నం జిల్లా యంత్రాంగం అనుమతించిన 287, 288 సర్వే నంబర్లతో ఉన్న ప్రభుత్వ భూమిలోనే డంప్‌ చేస్తున్నామని, ఆ మట్టిని భవిష్యత్‌లో లోతట్టు ప్రాంతాలను ఎత్తుచేసేందుకు జిల్లా యంత్రాంగం వినియోగిస్తుందని తెలిపింది. తీరప్రాంతంలో తాబేళ్లు, ఇతర సముద్ర జీవుల ఉనికికి ఎలాంటి ముప్పువాటిల్లడం లేదని స్పష్టం చేసింది. విశాఖపట్నం మెట్రో రీజనల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ మాస్టర్‌ ప్లాన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్టు ‘ఈనాడు’ తన కథనంలో చేసిన ఆరోపణ పూర్తిగా అవాస్తవమని తెలిపింది. ప్రాజెక్టు నిర్మిస్తున్న ప్రాంతం వీఎంఆర్‌డీఏ మాస్టర్‌ప్లాన్‌ మిక్స్‌డ్‌ యూజ్‌ జోన్‌–3 పరిధిలోకి వస్తుందంది. అంటే ఈ ప్రాంతంలో ఆతిథ్య రంగంలో ప్రాజెక్టులు నిర్మించేందుకు వీఎంఆర్‌డీఏ మాస్టర్‌ప్లాన్‌ అనుమతిస్తోందని వెల్లడించింది. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నియమించిన నలుగురు సభ్యుల కమిటీ ఈ ప్రాజెక్టును పరిశీలించి నిబంధనల మేరకు నిర్మాణాలు చేపడుతున్నట్టుగా నివేదిక ఇచ్చిందని గుర్తుచేసింది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రుషికొండ ప్రాజెక్టును పూర్తిచేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంది. సీఆర్‌జెడ్, వీఎంఆర్‌డీఏ నిబంధనలను అనుసరిస్తూ ఎన్‌జీటీ అనుమతుల మేరకు ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేస్తామని తెలిపింది. Tue, Apr 26 2022 4:16 AM
  • విశాఖ బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీస్తే ఊరుకోం.. సాక్షి, విశాఖపట్నం: విశాఖ అభివృద్ధి చెందటం చంద్రబాబుకు, ఈనాడుకు, ఎల్లో మీడియాకు ఎప్పుడూ కడుపుమంటగానే ఉంటుందని, విశాఖ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బ తీసేలా విషపురాతలు రాస్తే ఈ ప్రాంతవాసిగా సహించేది లేదని రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక వసతులు, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ హెచ్చరించారు. ‘రుషికొండ సాగరతీరంలో పరిమితులకు మించి ప్రభుత్వం తవ్వకాలు జరుపుతోందని ఒక దుర్మార్గమైన వార్తాకథనాన్ని ఈనాడు ప్రచురించింది. కేంద్రం నుంచి సీఆర్‌జెడ్‌ అనుమతులున్నా.. లేవంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తోంది. పూర్వం ఇక్కడ బిల్డింగులుండేవి.. ఇక్కడ పాతవయ్యాయని కొత్తగా తమ ప్రభుత్వం నిర్మిస్తే ‘రుషికొండ పిండి’ పేరుతో అవాస్తవాలను చంద్రబాబు రాయిస్తున్నారు.అడుగడుగునా విశాఖ అభివృద్ధిని చంద్రబాబు, టీడీపీ పాంప్లెట్‌ అయిన పనికిమాలిన పేపర్‌ ఈనాడు రామోజీరావు అడ్డుకుంటూనే ఉన్నారు..’ అని పేర్కొన్నారు. విశాఖపట్నంలోని మద్దిలపాలెంలోగల వైఎస్సార్‌సీపీ నగర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ మతాలకు, కులాలకు అతీతంగా అందరినీ ఆదరించిందని చెప్పారు. ఈనాడు పత్రికకు పునాదులు పడింది కూడా విశాఖలోనే అన్న విషయం మరిచిపోయి విషపు రాతలు రాస్తున్నారన్నారు. ‘తిండిపెట్టిన విశాఖ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటావా..? చంద్రబాబు చెప్పినట్లు విశాఖపై విషపు రాతలు రాస్తావా? తల్లిపాలు తాగి రొమ్ము గుద్దేలా రామోజీరావు తీరు ఉంది..’ అని ధ్వజమెత్తారు. చంద్రబాబు కోసం రామోజీరావు ఈనాడుని టీడీపీ పాంప్లెట్‌గా తయారుచేసి విషపు రాతలు రాస్తున్నాడని మండిపడ్డారు.చంద్రబాబుకి, ఈనాడు రామోజీరావుకి ఉత్తరాంధ్ర అంటే ఎందుకు అంత అక్కసు అని ప్రశ్నించారు. ‘అప్పుడు విశాఖ రైల్వేజోన్‌ చేయాలని మా పార్టీ ఉద్యమంచేస్తే మీ పార్టీ నేతలతో అడ్డుకున్నావు. పేదలకు ఇళ్ల పట్లాలిస్తే కోర్టులో కేసువేసి అడ్డుకున్నావు. విశాఖను పరిపాలన రాజధాని చేస్తే కోర్టుల్లో అడ్డుకున్నావు. చంద్రబాబుకు ఉత్తరాంధ్ర ప్రాంతమన్నా, విశాఖ అన్నా అంత కోపం ఎందుకో చెప్పాలి. అమరావతిలో కొన్న భూములకు రేట్లు తగ్గుతాయనే బాధ చంద్రబాబులో సుస్పష్టంగా కనబడుతోంది. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖను పరిపాలన రాజధానిగా చేయడం తథ్యం’ అని చెప్పారు. దేశంలోనే అద్భుత నగరంగా విశాఖను తమ నాయకుడు తీర్చిదిద్దుతారని పేర్కొన్నారు. కౌలు రైతులకు అండగా సీఎంఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 41 మంది కౌలు రైతులకు ఒక్కొక్కరికి రూ.7 లక్షల చొప్పున ఇచ్చి ప్రభుత్వం ఆదుకుందని చెప్పారు. తమ నాయకుడు రైతులకు అన్నివిధాల అండగా నిలుస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలోనే రైతులు ఆత్మహత్య చేసుకున్నారనే విషయం పవన్‌కల్యాణ్‌ తెలుసుకోవాలని సూచించారు.1.23 లక్షల మందికిఉచితంగా ఇళ్ల స్థలాలిస్తున్నాంముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 28న 1.23 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేయనున్నారని చెప్పారు. ఇది దేశచరిత్రలోనే ఓ రికార్డని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇళ్ల స్థలాలు ఇచ్చివారిలో లక్షమందికి ఒక్కొక్కరికి రూ.1.80 లక్షలతో ఇల్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. Tue, Apr 26 2022 4:07 AM
  • మేల్కొని.. కలగంటున్న రామోజీ సాక్షి అమరావతి:ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం శ్రీలంకలా తయారవుతోందని కొద్దిరోజులుగా ‘ఈనాడు’ రకరకాల కథనాలు వండి వారుస్తూనే ఉంది. తనకు మద్దతు పలికేవారు... తెలుగుదేశం సానుభూతి పరులు... వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి వ్యతిరేకుల చేత వ్యాసాలు రాయిస్తోంది. అలాంటివారు ఎక్కడ మాట్లాడినా అత్యంత ప్రాధాన్యాంశంగా ప్రచురిస్తోంది. ఇదంతా చూస్తే అర్థమయ్యేదొక్కటే. రామోజీరావుది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన కాదు!...రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుని దివాలా తీయాలన్న బలమైన కోరిక. తక్షణం శ్రీలంకలా మారిపోవాలన్న దౌర్భాగ్యపు ఆశ. ఇప్పటికిప్పుడు దివాలా తీసేయాలన్న దుర్మార్గపు ఆకాంక్ష. అలా జరిగితే వైఎస్‌ జగన్‌పై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని... రాష్ట్రం సర్వనాశనమైపోయినా సరే తన చంద్రబాబుకు మళ్లీ జవసత్వాలు వస్తాయనేది ఆ పత్రికాధిపతి దింపుడు కల్లం ఆశ. మరీ ఇంత దిగజారుడా..? తన సయామీ కవలలాంటి బాబుకు జనం దూరమయ్యారని తెలిసి... ఆ జనం నాశనమైపోవాలని కోరుకోవటమా? అసలిలాంటి రాతల్ని పాత్రికేయమంటారా? ‘ఈనాడు’ పనిగట్టుకుని వేస్తున్న లెక్కల్లో నిజమెంత? రాతల్లో ఏది సంబంధించి ఏది నిజం? ఒక్కసారి చూద్దాం.2021– 22 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి... అంటే గతనెల 31నాటికి రాష్ట్ర ప్రభుత్వ రుణం రూ.3,90,670 కోట్లు. దీన్ని ఇటీవలి బడ్జెట్లో అధికారికంగా ప్రభుత్వమే పేర్కొంది. కానీ రామోజీరావుకు ఇదేమీ కనిపించటం లేదు. రాష్ట్ర ప్రభుత్వ రుణమంటూ... తను కలలో చూసిన రూ.4,13,000 కోట్లనే పేర్కొంటున్నారు. ఏకంగా 23వేల కోట్లను పెంచి... విషం చిమ్మటాన్ని ఏమనుకోవాలి?ఇదేకాదు... రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీలపైనా తప్పుడు రాతలే. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల మేరకు రూ 1,17,503 కోట్ల రుణాలకు గ్యారెంటీ ఇచ్చింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది కూడా. కానీ ‘ఈనాడు’ మాత్రం 1,38,603 కోట్లుగా తప్పుడు గణాంకాలను అచ్చేసేసింది. ప్రభుత్వం ఏ గ్యారెంటీ ఇవ్వని సంస్థల అప్పులు రూ.75,223 కోట్లన్నట్టు రాసేసింది. దీనికితోడు రూ.1,50,000 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయనేది మరో అబద్ధం. ఇవన్నీ రామోజీరావు ఊహలే తప్ప... పెండింగ్‌ బిల్లుల గురించి రాష్ట్ర ప్రభుత్వాలు గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ ఎన్నడూ అధికారికంగా ప్రకటించింది లేదు. గ్యారంటీ ఇవ్వని అప్పులంటూ ఏ సమాచారమూ లేదు. అయినా సరే... కేంద్రం వద్ద ఈ గణాంకాలున్నాయని వేరే పత్రికేదో రాసిందంటూ... ‘ఈనాడు’ పతాక శీర్షికల్లో అచ్చేసి పారేసింది.నిపుణులంటే ఎవరు రామోజీ?‘ఈనాడు’ రాతల్లో ఎంతటి రోత ఉందో చెప్పటానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. అప్పులు ఎక్కువగా ఉన్న టాప్‌–5 రాష్ట్రాల్లో ఏపీది 4వ స్థానమన్నది ‘ఈనాడు’ కథనం ఎత్తుగడ. ఈ మేరకు వేరేదో ఆన్‌లైన్‌ సైట్లో వార్త వస్తే... తమకు కావలసినట్లుగా ఉంది కనక ఎత్తి పారేశామన్నది ‘ఈనాడు’ భాష్యం. మరి అలా ఎత్తి పోసుకున్నపుడు అందులో ఉన్నది ఉన్నట్టు రాయాలి కదా? ఏపీది నాలుగో స్థానమే కానీ... నిపుణులు చెబుతున్న లెక్కలను బట్టి చూస్తే అప్పుల్లో మొదటి స్థానం వస్తుందనేది రామోజీరావు సొంత భాష్యం. ఎవరా నిపుణులు రామోజీ? నీ సహచరుడు చంద్రబాబేగా? బాబు బయట ఏం చెబితే దానికి ‘ఈనాడు’లో సొంత కథనాలు రాయటం మీకు వైస్రాయ్‌తో పెట్టిన విద్య కాదా? ఇంకా ఎన్నాళ్లిలా?వాస్తవాలెందుకు పట్టించుకోరు?చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అప్పులు, గ్యారెంటీలు భారీగా పెరిగినా రామోజీ దృష్టిలో అది రామరాజ్యమే. ఇప్పుడు కోవిడ్‌తో రెండేళ్లగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ బలహీనపడినా... ఏపీ మాత్రం అత్యంత బలంగా ఉండి తీరాలన్నది ఆయన ఉద్దేశం. బాబు హయాంలో అప్పులు 20.39 శాతం పెరిగితే... ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పెరిగింది 15.46 శాతమే. ఈ వాస్తవాలన్నిటికీ ముసుగేసి ‘ఈనాడు’ ఆందోళన వ్యక్తంచేయటం కుట్ర తప్ప మరొకటి కాదనే చెప్పాలి.అప్పుల తగ్గుదల కనిపించడం లేదా?నిజానికి రామోజీ రాసినట్లు రాష్ట్రానికి సంబంధించిన అప్పులు, గ్యారెంటీలు ఏవీ ఆందోళనకరంగా లేవు. అప్పులు నిబంధనలకు లోబడే ఉన్నాయి. తాజాగా చూస్తే... రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో (జీఎస్‌డీపీ) అప్పుల శాతం 2020–21లో 35.53 శాతం ఉండగా.. అది 2021–2022 నాటికి 32.51 శాతానికి తగ్గింది. ‘ఈనాడు’ మాత్రం దీన్ని రాస్తే ఒట్టు!!. అయినా శ్రీలంక అనేది ఒక సార్వభౌమ దేశం. పొరుగుదేశాల విషయంలో అది పాటించిన వి«ధానాలతో పాటు... పన్నులు, వడ్డీ రేట్లు పెంచకుండా బయటి రుణాలు తేవటం విదేశీ నిల్వలు తరిగిపోవటానికి కారణమయింది. దీంతో విదేశీ రుణాలు చెల్లించలేక డిఫాల్టవుతోంది. అసలు భారతదేశంలో రాష్ట్రంగా ఉన్న ఏపీతో దానికి పోలికేంటి? వడ్డీ రేట్లపైన, బొగ్గు ధరలపైన రాష్ట్రానికి ఏం నియంత్రణ ఉంటుంది? మరి ఈ రెండిటినీ పోల్చటమేంటి? ఒకవేళ ఏదైనా రాష్ట్రంలో పరిస్థితి అదుపుతప్పే అవకాశముందని భావిస్తే కేంద్రం హెచ్చరిస్తుందిగా? అవేమీ లేకున్నా రామోజీకి అంత ఆందోళనెందుకు? ఇదంతా పథకం ప్రకారం బాబు గీసిన స్కెచ్‌ ప్రకారం జరుగుతున్న కుట్ర కాదా?ఈనాడు చెప్పని నిజాలివీ...2021– 22లో రాష్ట్ర ఆదాయ వసూళ్లు రూ.1,54,272.70 కోట్లు... నికర అప్పులు రూ.41,164 కోట్లు. ఈ అప్పు ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు లోబడే ఉంది. మొత్తం రూ.1,95,437 కోట్లు. దీన్లో ఉద్యోగుల జీతాలు, ఉద్యోగుల పెన్షన్లు, అప్పుల బాధ్యత, సాధారణ పరిపాలన ఖర్చులు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర వాటా వంటి చట్టపరమైన బాధ్యతలకు చేస్తున్న వ్యయం రూ.1,20,000 కోట్లు. అంటే రాష్ట్ర ఆదాయంలో ఇది 60 శాతం. మిగతా వ్యయం ఉచిత వ్యవసాయ విద్యుత్‌కు రాయితీ, పౌరసరఫరాల సబ్సిడీ, వృద్దాప్య పింఛన్లు, ప్రభుత్వ ఇతర సంక్షేమ కార్యక్రమాలు, నీటి పారుదల, ఇతర ప్రాజెక్టుల నిర్వహణపై చేస్తున్నారు. మరి చట్టపరమైన బాధ్యతలకోసం వెచ్చించాల్సిన మొత్తం రాబడిలో 60 శాతం మాత్రమే ఉన్నపుడు... చట్ట పరమైన బాధ్యతలేవీ తీర్చలేని స్థితిలో ఉన్న శ్రీలంకతో పోల్చటమేంటి? కొంచెం కూడా ఇంగితం లేదనుకోవాలా? 2021–22 ద్రవ్య లోటు రూ.38,224 కోట్లే... ఇది కేంద్రం ఆమోదించిన ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు లోబడే ఉంది. మరి ‘ఈనాడు’కు, దాని నిపుణులకు ఆందోళన ఎందుకు? సంక్షేమ పథకాల్లో కోత పెట్టాలనే అడ్డగోలు సూచనలెందుకు? Wed, Apr 20 2022 3:42 AM
  • జర్నలిజమా లేక అధికార పిచ్చా! సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రిగా తమ వాడు లేకపోతే ఈనాడు, మరికొన్ని పత్రికలు, మీడియా సంస్థలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పచ్చి అబద్ధాలు రాస్తాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ధ్వజమెత్తారు. సోమవారం ఆయన విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో సామాజిక పింఛన్ల పంపిణీపై ఈనాడులో ప్రచురితమైన కథనం తప్పుడు ప్రచారంలో భాగమేనని చెప్పారు. మీవాడు అధికారంలో లేడని కడుపు మంటతో సామాజిక పింఛన్లను కూడా వక్రీకరించి రాస్తున్నారని, ఇంతకన్నా సిగ్గుమాలిన వ్యవహారం ఉంటుందా? దీనిని జర్నలిజం అంటారా? అంటూ తూర్పారపట్టారు.పింఛన్లవాస్తవాలు ఇవిగో..‘2014–19 మధ్య చివరి రెండు నెలలూ మినహాయిస్తే చంద్రబాబు ప్రభుత్వం నెలకు ఇచ్చిన సామాజిక పింఛన్‌ రూ.1,000 మాత్రమే. ఆయన నెలవారీగా ఇచ్చిన పింఛన్లు 39 లక్షలే. ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రతి నెలా ఏకంగా 62 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వంలో పింఛన్ల మీద నెలకు రూ.400 కోట్లు మాత్రమే ఖర్చు చేసేవారు. ఇప్పుడు నెలకు రూ.1,570 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. అంటే అప్పట్లో ఇచ్చిన దానికంటే నెలకు రూ.1,170 కోట్లు, ఏడాదికి రూ.14,040 కోట్లు ఎక్కువ. పింఛన్ల కోసం ఇంత ఖర్చు చేస్తున్నందుకు చంద్రబాబుకు బాధగా ఉందా? లేక రామోజీరావుకు కడుపుమంటగా ఉందా?’ అని ప్రశ్నించారు.జన్మభూమి కమిటీల ఆగడాలపైఅప్పుడెందుకు రాయలేదో?‘బాబు హయాంలో ఉన్న జన్మభూమి కమిటీల దోపిడీపై ఇదే ఎల్లో మీడియా ఎందుకు చెప్పలేదు? పింఛన్లు కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పోస్టాఫీస్‌ల ముందు మండుటెండలో క్యూలు కట్టేవారు. క్యూలలో నిల్చోలేక పలువురు చనిపోయిన విషయాన్ని ఎందుకు చెప్పలేదు? అప్పట్లో ప్రతి నెలా పింఛను ఇచ్చింది 89 శాతం మందికే. ఇప్పుడు ప్రతి నెలా 1వ తేదీనే 90 శాతం మందికి, మొదటి అయిదు రోజుల్లోనే 99 శాతం మందికి పింఛన్లు చేరుతున్నాయి. పదేపదే తిప్పించుకుని పింఛన్‌ ఇచ్చిన ప్రభుత్వం ఎవరిది? నెలలో మొదటి రోజే, సూర్యోదయానికి ముందే పెన్షనర్లు ఎక్కడ ఉంటే అక్కడికే వలంటీర్లు వెళ్లి పింఛన్లు ఇస్తున్న ప్రభుత్వం ఎవరిది? అని ప్రశ్నించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికీ అక్కడికే వెళ్లి ఇస్తున్నారు. కరోనా కష్ట కాలంలో కూడా పింఛన్ల రూపంలో çరూ.50 వేల కోట్లు పంపిణీ చేశామన్నారు. ఇప్పుడు పింఛన్లకు కోటాలు, కోతలు లేవు. కులం, మతం, వర్గం, రాజకీయ పార్టీ ఏదన్నది చూడటంలేదు. లంచాలు, దళారీలకు చోటు లేదు. జన్మభూమి కమిటీల ముందు అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు ఆత్మాభిమానాన్ని చంపుకొని మోకరిల్లాల్సిన పరిస్థితి లేనే లేదు. అర్హులైన ప్రతి ఒక్కరికీ అందుతున్నాయి. ఏడుపంతా ఇదే కదా?’ అని అన్నారు.ప్రతి దాంట్లోఅబద్ధపు ప్రచారమే..‘అమ్మ ఒడి స్కీమ్‌లో అర్హతలు మార్చేశారని ఇటీవలే రాశారు. మత్స్యకార భరోసా స్కీమ్‌లో అర్హతలు మార్చేశారని మరో రోజు రాశారు. ఏ ఒక్క అర్హతా మార్చలేదు. పైగా, మొదట నెలకు 200 యూనిట్ల లోపు వాడుకునే వారికే అమ్మ ఒడిని వర్తింపజేస్తే.. తర్వాత దాన్ని 300 యూనిట్లు చేసింది జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం. దీనివల్ల 95 శాతం మందికి అమ్మ ఒడి అర్హత లభించింది. దాన్ని కూడా వక్రీకరించి రాశారు. మత్స్యకారుల కుటుంబాల్లో పిల్లలు ఎవరైనా వివాహం చేసుకుని వేరే కాపురం పెడితే... వారికి కూడా ఈ స్కీములన్నీ వర్తిస్తాయి. మత్స్యకారులకు, బీసీలకు ఏనాడూ ఏమీ చేయని చంద్రబాబును సమర్థించి.. ఇలాంటి మంచి స్కీముల్ని విమర్శించటాన్ని జర్నలిజం అంటారా? లేక అధికార పిచ్చి, కుల పిచ్చి అంటారా?’ అని ముత్యాలనాయుడు ప్రశ్నించారు. Tue, Apr 19 2022 2:56 AM
  • మారీచులతో యుద్ధం చేస్తున్నాం సాక్షి, అమరావతి: ‘‘మనం మారీచులతో యుద్ధం చేస్తున్నాం. మాములుగా మాట్లాడినా వక్రీకరిస్తారు. ఆ దుష్ఫ్రచారాన్ని గ్రామ స్థాయిలో సమర్థంగా తిప్పికొట్టాలి. ప్రతి గ్రామంలో పది మంది క్రియాశీల కార్యకర్తలను ఎంపిక చేసి డైనమిక్‌గా శిక్షణ ఇవ్వాలి...’’ అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు సీఎం వైఎస్‌ జగన్‌ సూచించారు. ఈ మేరకు మంగళవారం పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏం చెప్పారంటే..ఉన్మాదులతో యుద్ధం చేస్తున్నాం..మనం చేస్తున్న యుద్ధం కేవలం చంద్రబాబుతో కాదు... ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 లాంటి ఉన్మాదులతో యుద్ధం చేస్తున్నాం. ఒక అబద్ధాన్ని నిజం చేసేందుకు ఇష్టమొచ్చినట్లుగా వక్రీకరిస్తారు. నానా ప్రయత్నాలూ చేస్తారు. ఇన్ని మీడియా చానళ్లు వారి దగ్గరే ఉన్నాయి కాబట్టి గోబెల్స్‌ ప్రచారంతో బుల్డోజ్‌ చేస్తారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తారు.నిప్పు లేకుండానే పొగ బెడతారు..ఈ వ్యవస్థలు ఏ స్థాయికి దిగజారిపోయాయంటే.. ఇప్పుడు నిప్పు లేకుండానే పొగ బెడుతున్నారు. ఏమీ లేకపోయినా.. ఏదో జరిగిపోతోందనే భ్రమలు కల్పిస్తారు. అసత్యాలు, గోబెల్స్‌ ప్రచారాలతో మనం యుద్ధం చేయాల్సి వస్తోంది. కాబట్టి మన కార్యకర్తలకు మన వెర్షన్‌ బలంగా తెలిసుండాలి. అదే మన బలం. వారిని ఆ దిశగా చైతన్యం చేయాలి. అది జరగాలంటే మీరు వారితో పూర్తిగా మమేకం కావాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. ప్రతి గ్రామంలో పది మంది కార్యకర్తలను ఇందులో భాగస్వాములను చేయాలి.టీడీపీ దుష్ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టాలిమీరు (పార్టీ ఎమ్మెల్యేలు) గ్రామాలకు వెళ్లినప్పుడు రెండు మూడు ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించాలి. ప్రతి గ్రామంలో మన ప్రజా ప్రతినిధులున్నారు. సర్పంచులు, వార్డు మెంబర్లు, బూత్‌ కమిటీలు, ఎంపీటీసీలు ఉన్నారు. టీడీపీ అసత్య ప్రచారాలను గ్రామ స్థాయిలో సమర్ధంగా తిప్పికొట్టాలి. అలా జరగాలంటే వారందరికీ డైనమిక్‌గా ట్రైనింగ్‌ ఇవ్వాలి. ప్రతి గ్రామంలో 10 మంది కార్యకర్తలను క్రియాశీలం చేయటాన్ని మీ కార్యక్రమంలో భాగం చేసుకోవాలి. తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ సాక్ష్యాధారాలతో ఎదుర్కోవాలి. Wed, Mar 16 2022 5:47 AM
  • సారాయి సాధ్యమేనా? ఏమైనా లాజిక్‌ ఉందా...?నిత్యం ప్రజలు సంచరించే ప్రాంతం.. పోలీస్‌స్టేషన్‌తో సహా పలు ప్రభుత్వ కార్యాలయాలున్న జంగారెడ్డిగూడెం లాంటి చోట అందరి కళ్లుగప్పి నాటు సారా తయారీ సాధ్యమయ్యే పనేనా? ఎక్కడో మారుమూలన, నిర్జన ప్రాంతంలో అలా జరుగుతోందంటే నమ్మవచ్చేమో..! విపక్షం కాస్త లాజిక్‌గా ఆలోచించాలి.– సీఎం వైఎస్‌ జగన్‌సాక్షి, అమరావతి: నాటుసారా కాసేవారికి అండగా నిలిచే ప్రసక్తే లేదని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. కల్తీ మద్యం తయారీదారులపై ఉక్కుపాదం మోపుతున్నామని, ఎస్‌ఈబీని ఏర్పాటు చేసి కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. జంగారెడ్డిగూడెం ఘటనపై టీడీపీ సభ్యులు మంగళవారం కూడా సభా కార్యక్రమాలకు అడ్డు తగలడంతో సీఎం స్పందిస్తూ అక్రమ మద్యానికి సంబంధించి ఇప్పటికే 13 వేల కేసులు నమోదు చేశామంటే ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోందో అందరికీ అర్థమవుతోందని తెలిపారు. టీడీపీ సభ్యులు నాగరికంగా ప్రవర్తించాలని, సభ జరగకూడదనే ఆలోచనను పక్కన పెట్టాలని సూచించారు. లాజిక్‌గా కాస్త బుర్ర పెట్టి ఆలోచించాలని, వారు ప్రస్తావిస్తున్న అంశాలపై తాను కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. కళ్లుగప్పి సారా తయారీ సాధ్యమేనా?దాదాపు 55 వేల జనాభా నివసిస్తున్న జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎవరైనా సారా కాయగలరా? అని సీఎం ప్రశ్నించారు. పైగా అది ఒక మున్సిపాలిటీ అని గుర్తు చేశారు. 2011 లెక్కల ప్రకారం అక్కడ 44 వేల జనాభా ఉండగా ప్రస్తుతం దాదాపు 55 వేల మంది నివసిస్తున్నట్లు తెలిపారు. అక్కడ పోలీస్‌ స్టేషన్, వార్డు సచివాలయాలు, మహిళా పోలీస్‌లున్నారని చెప్పారు. వారందరి కళ్లు గప్పి సారా కాయడం సాధ్యమా? అని ప్రశ్నించారు. ఎక్కడో మారుమూల గ్రామంలో, నిర్జన ప్రదేశంలో సారా కాస్తున్నారంటే నమ్మవచ్చని, జంగారెడ్డిగూడెం లాంటి పట్టణంలో సారా కాయడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు.చంద్రబాబు మాటలకు పొంతన ఉందా?ప్రతిపక్ష నేతచంద్రబాబు వ్యాఖ్యలు చూస్తే ఆశ్చర్యం కలుగుతోందని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఒకవైపు ప్రభుత్వం మద్యం విక్రయాలను పెంచుతోందంటూ మరోవైపు జనం సారా తాగుతున్నారని పొంతన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. నాటు సారా తాగిస్తే ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుంది కదా అనే కామన్‌సెన్స్‌ లేకుండా మాట్లాడుతున్నారని చెప్పారు. ‘రాష్ట్ర బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా రూ.25 వేల కోట్ల అప్పు తేవడంతో పాటు మరో రూ.25 వేల కోట్లు రుణానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని చంద్రబాబు అంటున్నారు. మద్యం విక్రయాలు బాగా పెంచి ఆదాయం పొందాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. మరోవైపు నాటు సారా తాగి మనుషులు చనిపోయారని చెబుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్ధం కావడం లేదు’ అని మండిపడ్డారు. ‘ఈనాడు’ వక్రభాష్యంప్రతి గ్రామంలో 90 సహజ మరణాలుంటాయని తాను వ్యాఖ్యానించినట్లు ఈనాడులో వ్యంగ్యంగా రాశారని సీఎం పేర్కొన్నారు. 2011 లెక్కల ప్రకారం జంగారెడ్డిగూడెం జనాభా 44 వేలు కాగా పదేళ్ల తర్వాత 12 శాతం పెరుగుదలతో ఇప్పుడు దాదాపు 55 వేల మంది ఉన్నట్లు చెప్పామన్నారు. దేశంలో 2 శాతం మరణాల రేటు ఉన్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయని, ఆ మరణాలు.. వృద్ధాప్యం, అనారోగ్యం, మరే ప్రమాదం వల్లైనా కావచ్చన్నారు. ఆ మేరకు 55 వేల జనాభా ఉన్న జంగారెడ్డిగూడెంలో 2 శాతం సగటుగా తీసుకుంటే ఏటా దాదాపు వెయ్యి మంది చనిపోతున్నారని, అంటే నెలకు దాదాపు 90 మంది చనిపోతున్నట్లు అవుతుందన్నారు.ఈనాడు పత్రిక దాన్ని కూడా వక్రీకరించి రాసిందన్నారు. నిజానికి జంగారెడ్డిగూడెంలో ఆ మరణాలన్నీ ఒకే చోట, ఒకే రోజు జరగలేదన్నారు. వేర్వేరు చోట్ల వారం వ్యవధిలో చోటు చేసుకున్నాయని, మరణించిన వారి అంత్యక్రియలు కూడా జరిగాయన్నారు. అప్పుడు ఏ రాద్ధాంతం జరగలేదన్నారు. ఒకచోట ప్రభుత్వమే చొరవ చూపి పాతిపెట్టిన భౌతిక కాయానికి పోస్టుమార్టమ్‌ నిర్వహించిందన్నారు. నిజంగానే అది సారా మరణం అయితే ప్రభుత్వం పోస్టుమార్టమ్‌ నిర్వహిస్తుందా? అని ప్రశ్నించారు.గోబెల్స్‌ ప్రచారం...‘ఒక అబద్ధాన్ని ప్రచారంలోకి తీసుకురావాలి.. దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 ఢంకా భజాయించాలి... ఆ విధంగా గోబెల్స్‌ ప్రచారం చేయాలి. ఓ అబద్ధాన్ని వందసార్లు చెబితే ప్రజలు విశ్వసిస్తారని వారి నమ్మకం. అందుకే ముందు ఒకరు అందుకుంటారు.. ఆ వెంటనే మిగిలిన వారు, చంద్రబాబు పదేపదే అదే విషయాన్ని చెబుతారు. కొన్ని మీడియా సంస్థలు, వాటి యాజమాన్యాలు, చంద్రబాబు కలసి వాస్తవాలను వక్రీకరిస్తున్నారు..’ అని సీఎం జగన్‌ మండిపడ్డారు.జరగని దాన్ని జరిగినట్లుగా చూపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి మంచి చేయడానికి సలహాలు ఇస్తే స్వీకరిస్తామని, అంతే కానీ ఇలాంటి ప్రవర్తనతో సభా కార్యక్రమాలను అడ్డుకోవద్దని టీడీపీ సభ్యులకు సూచించారు. బడ్జెట్‌ చర్చల్లో విపక్షం పాలుపంచుకోవాలని, సలహాలు ఇస్తే నోట్‌ చేసుకుంటామన్నారు. పద్ధతి మార్చుకోవాలని, ఇలాగే వ్యవహరిస్తూ కొత్త రూల్‌ ప్రకారం సస్పెండ్‌ కాదలచుకుంటే వారి ఇష్టానికే వదిలేస్తున్నామన్నారు. Wed, Mar 16 2022 4:03 AM
  • పీఆర్సీపై పచ్చపత్రికల విషం సాక్షి, అమరావతి: ఉద్యోగులకు పీఆర్సీపై ‘ఈనాడు’ మరోసారి తన మార్కు విషం వెళ్లగక్కింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వంతోపాటు దేశంలో అత్యధిక రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తమ ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీని ప్రకటించింది. తద్వారా ఏటా రూ.11,707 కోట్ల ఆర్థిక భారం భరించేందుకు సిద్ధపడింది. కానీ, ఈనాడు పత్రిక మాత్రం ‘అశుతోష్‌ మిశ్రా కమిటీ సిఫార్సులకు వక్రభాష్యం చెబుతూ ‘ప్రభుత్వంపై పీఆర్సీ భారం రూ.3,181 కోట్లే’ అనే శీర్షికన అవాస్తవ కథనాన్ని ప్రచురించి ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నించింది. తనదైన శైలిలో కమిటీ నివేదికకు వక్రభాష్యాలు చెబుతూ అసత్యాలతో కథనాన్ని వండివార్చింది. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ప్రజలకు వాస్తవాలు వివరించేందుకే ఈ కథనం.ఏటా అదనపు ఆర్థికభారంరూ.11,707 కోట్లు23 శాతం ఫిట్‌మెంట్‌ అమలుచేస్తూ ఈ ఏడాది జనవరి 17న జారీచేసిన రెండు జీఓల ప్రకారం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, హెచ్‌ఆర్‌ఏతో పాటు, అదనపు పెన్షన్‌ మొత్తం (ఏక్యూపీ) చెల్లింపుల వల్ల ప్రభుత్వంపై అదనంగా పడిన ఆర్థిక భారం రూ.10,247 కోట్లు. ఆ తర్వాత ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు, వేతనాల సవరణపై ఉద్యోగులకు ఉన్న అపోహలు తొలగిస్తూ, వారి సందేహాల నివృత్తి కోసం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటుచేశారు. ఆ ఉప సంఘం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో పలు దఫాలుగా చర్చలు జరిపిన అనంతరం హెచ్‌ఆర్‌ఏ, ఏక్యూపీతో పాటు, సీసీఏలు సవరించాలని సిఫార్సు చేసింది. దీంతో ప్రభుత్వంపై మరో రూ.1,460 కోట్ల భారం పడుతోంది. దీంతో 11వ పీఆర్సీ అమలువల్ల ప్రభుత్వంపై అదనంగా పడుతున్న మొత్తం భారం రూ.11,707 కోట్లు.► అలాగే, 2019 జూలై నుంచి 2020 మార్చి వరకు ఇచ్చిన ఐఆర్‌ను తిరిగి వసూలు చేయకూడదని తీసుకున్న నిర్ణయంవల్ల ప్రభుత్వంపై ఒకేసారి రూ.5,156 కోట్ల భారం పడింది.► ఐఆర్‌తో పాటు, కొత్తగా ఫిట్‌మెంట్‌ ఇస్తూ అమలుచేసిన వేతనాల సవరణ వల్ల ప్రభుత్వంపై పడుతున్న మొత్తం భారం రూ.11,707 కోట్లు. వాస్తవాలు ఇలా ఉంటే.. టీడీపీ అనుకూల పత్రిక ఈనాడు మాత్రం పీఆర్సీతో ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం ఏటా రూ.3,181 కోట్లేనంటూ అవాస్తవాలను ప్రచురించి ఉద్యోగులు, ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. కేవలం ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు వాస్తవాలను వక్రీకరిస్తూ బురదజల్లేందుకు యత్నించడంపట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం, భారతీయ కార్మిక సదస్సు (ఐఎల్‌సీ) నియమాలకు అనుగుణంగా వేసిన గణాంకాల మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు 23 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని 11వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ) సూచించింది. అయితే, ఉద్యోగులకు అప్పటికే 27 శాతం తాత్కాలిక భృతి (ఐఆర్‌) ఇస్తున్నందున అంతే ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని 11వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వివిధ శాఖల కార్యదర్శుల కమిటీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని సిఫార్సు చేసింది.ఎందుకంటే అంతకుముందు ఎక్కువ మొత్తంలో ఇచ్చిన ఫిట్‌మెంట్స్‌వల్ల ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ) గణనీయంగా పెరిగి రాష్ట్ర ఖజానాపై మోయలేని భారం పడుతోంది. ప్రభుత్వ సొంత ఆదాయం (ఎస్‌ఓఆర్‌) కంటే కూడా ఉద్యోగుల జీతభత్యాల వ్యయం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో.. ప్రతి ఐదేళ్లకోసారి వేతనాలు సవరించాలన్న ప్రక్రియ కార్యరూపం దాల్చడం కష్టమని కమిటీ భావించింది. అందుకే కేంద్ర ప్రభుత్వ 7వ వేతన సంఘం (సీపీసీ) సిఫార్సులకు అనుగుణంగా ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని కార్యదర్శుల కమిటీ సిఫార్సు చేసింది.సిఫారసు చేయకపోయినా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు 23శాతం ఫిట్‌మెంట్‌ఇక మరో పచ్చపత్రిక ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకూ 30శాతం స్కేల్‌ పెంచాలని పీఆర్సీ కమిటీ సిఫార్సులంటూ అవాస్తవాలను ప్రచురించడం విస్మయపరుస్తోంది. వాస్తవం ఏమిటంటే.. 11వ పీఆర్సీ కమిటీ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలపై ఎలాంటి సిఫార్సులూ చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సానుకూల దృక్పథంతో స్పందించి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా 23శాతం ఫిట్‌మెంట్‌ అమలుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. తద్వారా ఏటా రూ.430కోట్ల ఆర్థిక భారాన్ని వహించేందుకు సిద్ధపడింది. ఆర్థిక ఇబ్బందులున్నా ఉద్యోగుల సంక్షేమానికే పెద్దపీటఇక కేంద్ర ప్రభుత్వం ప్రతి పదేళ్లకోసారి పీఆర్సీ విధానాన్ని అమలుచేస్తూ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించింది. దేశంలో చాలా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ విధానాన్నే అమలుచేశాయి. ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు తదితర రాష్ట్రాలు తమ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించాయి. కేరళ ప్రభుత్వం అంతకంటే తక్కువగా 10 శాతం ఫిట్‌మెంట్‌ మాత్రమే ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగులు, పింఛనర్ల సంక్షేమానికి మరింత ప్రాధాన్యమిచ్చి సానుకూల దృక్పథంతో వ్యవహరించింది. 23 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వంతోపాటు పలు రాష్ట్రాలు ఇచ్చిన ఫిట్‌మెంట్‌ కంటే ఇది చాలా ఎక్కువ. అంతేకాదు.. ఏపీ ప్రభుత్వం ఐదేళ్లకోసారి పీఆర్సీ అమలుచేస్తామని కూడా చెప్పింది. Mon, Mar 7 2022 4:08 AM

Most Popular Latest News

మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే? వరల్డ్‌కప్‌ జట్టులో నో ఛాన్స్‌: రోహిత్‌పై కేఎల్‌ రాహుల్‌ కామెంట్స్‌ వైరల్‌ ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు అలెర్ట్‌.. మారిన విత్‌ డ్రా నిబంధనలు ఎన్‌ఆర్‌ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం స్వాతి మలివాల్‌ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్‌ Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్‌ జంట పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
View All
తీవ్ర తుపానుగా రెమాల్‌.. ప్రధాని హై లెవెల్‌ మీటింగ్‌ #SRH: లీగ్ మ్యాచ్‌ల్లో అద‌ర‌గొట్టారు.. ప్లే ఆఫ్స్‌లో తుస్సుమ‌న్పించారు కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న నమో.. ఆకట్టుకుంటోన్న ఫస్ట్ లుక్‌ పోస్టర్! 'రోజుకి ఒక రాయి తినండి': గూగుల్ ఏఐ దిమ్మతిరిగే సమాధానం కొండ చరియల బీభత్సం.. 670 మంది మృతి పాఠాలు చెబుతున్న ఏఐ టీచరమ్మ.. ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ పాండే పదవీకాలం పొడిగింపు సన్నజాజి నడుముతో మౌనీ రాయ్.. మాళవిక అందాలు పాన్‌ కార్డులో మార్పులు చేసుకోండిలా.. ఎన్నికలు ముగియగానే కాశ్మీర్‌కు.. అమిత్‌ షా కీలక ప్రకటన
View All

eenadu media - Latest News in Telugu, Photos, Videos, Today Telugu News on eenadu media | Sakshi (29)

తప్పక చదవండి

  • ఎన్నికలు ముగియగానే కాశ్మీర్‌కు.. అమిత్‌ షా కీలక ప్రకటన
  • టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్‌.. కానీ ఒకే ఒక‌ కండీష‌న్‌!?
  • జూన్‌లో బ్యాంకులు పని చేసేది ఎన్ని రోజులంటే..
  • హైదరాబాద్‌లో లగ్జరీ ప్రాపర్టీలు కొన్న నీలిమా దివి..
  • చంపుతామని బెదిరిస్తున్నారు: స్వాతిమలివాల్‌
  • ఆ నలుగురికి చివరికి మిగిలిందేంటి?
  • ఇంట్లో ఆంక్షలు? ఎవరు స్ట్రిక్ట్‌? సితార ఫన్నీ ఆన్సర్స్‌
  • ఆమె క్రికెటర్స్‌ పాలిట దేవత..1983 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టు కోసం..
  • ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి?.. ఖర్గే చమత్కారం
  • ఓటీటీ లవర్స్‌కు జియో సినిమా బంపరాఫర్‌

Advertisem*nt

eenadu media - Latest News in Telugu, Photos, Videos, Today Telugu News on eenadu media | Sakshi (2024)
Top Articles
Latest Posts
Article information

Author: Gov. Deandrea McKenzie

Last Updated:

Views: 6477

Rating: 4.6 / 5 (46 voted)

Reviews: 93% of readers found this page helpful

Author information

Name: Gov. Deandrea McKenzie

Birthday: 2001-01-17

Address: Suite 769 2454 Marsha Coves, Debbieton, MS 95002

Phone: +813077629322

Job: Real-Estate Executive

Hobby: Archery, Metal detecting, Kitesurfing, Genealogy, Kitesurfing, Calligraphy, Roller skating

Introduction: My name is Gov. Deandrea McKenzie, I am a spotless, clean, glamorous, sparkling, adventurous, nice, brainy person who loves writing and wants to share my knowledge and understanding with you.